Good News for AP Inter Students Who failed in AP Inter Exams: ఏపీలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలలో ఫెయిలైన హైస్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదనపు తరగతులను ఉచితంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులను నిర్వహించాలని పేర్కొంటూ.. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది.
ఏపీలో ఇటీవలే ఇంటర్ ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. హైస్కూల్ ప్లస్ ఇంటర్ విద్యార్థులు 4542 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా.. 12652 మంది, సెకండియర్ పరీక్షలు 2024 మంది రాయగా.. 690 మంది మాత్రమే పాసయ్యారు. మిగతా విద్యార్థులంతా ఫెయిలయ్యారు. పాసైన వారికంటే ఫెయిలైన విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది.
Also Read: పదో తరగతి ఫలితాలొచ్చేశాయ్.. 17 స్కూల్స్ లో ఒక్కరూ పాసవ్వలేదు!
24వ తేదీ నుంచి జూన్ 1 వరకూ.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ విద్యార్థులకు తరగతులు నిర్వహించి.. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలని అధికారులు తెలిపారు. అలాగే ప్రతిరోజూ.. విద్యార్థుల అటెండెన్స్, చదువుతీరును గూగుల్ ఫామ్ లో అప్డేట్ చేయాలని పేర్కొన్నారు.