BigTV English
Advertisement

Rajinikanth’s Thangam: రజినీకాంత్ – లోకేష్ మూవీ టైటిల్ ‘తంగం’… టైటిల్ ఫొటో లీక్

Rajinikanth’s Thangam: రజినీకాంత్ – లోకేష్ మూవీ టైటిల్ ‘తంగం’… టైటిల్ ఫొటో లీక్

Rajinikanth – Lokesh Kanagaraj Combo Movie Thangam Photo Leaked: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 60 ఏళ్ల వయసులో కుర్రకారు హీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు తీసి ప్రేక్షకాభిమానుల్ని అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ స్టార్ మరొక యంగ్ డైరెక్ట్‌తో ఓ మూవీ చేస్తున్నాడు.


‘విక్రమ్’ మూవీతో కమల్ హాసన్ కెరీర్‌ను రీస్టార్ట్ చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు రజినీకాంత్‌తో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ‘తలైవర్ 171’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీ టైటిల్‌కి సంబంధించి తాజాగా ఓ లీక్ బయటకొచ్చింది. ఈ మూవీకి గానూ ‘కళుగు’, ‘రానా’ అనే టైటిళ్లను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మరొక టైటిల్ బయటకొచ్చింది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఇంతలోపే ఈ మూవీ టైటిల్ ఫొటో లీక్ అయి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి గానూ ‘తంగం’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి టైటిల్ ఫొటో కూడా లీక్ అయింది. ఆ ఫొటో ప్రకారం.. సూపర్ స్టార్ ‘తంగం’ అని ఉంది. ఆ నేమ్ కింద దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, స్టంట్స్ కొరియోగ్రాఫర్ అన్బరివ్ పేర్లు కనిపిస్తున్నాయి. ఈ టైటిల్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో మరింత ఎనర్జీ వచ్చింది.


Also Read: రజినీకాంత్ – లోకేష్ మూవీలో టాలీవుడ్ బడా హీరో!

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో బయటకొచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మూవీలో రజినీ కాంత్‌కు కూతురిగా విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండటం వల్లనే ఆమే ఈ రోల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ మూవీ మొత్త తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌తోనే నడుస్తుందట. ఇకపోతే ఈ మూవీలో మరొక హీరో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఈ మూవీలో కీలక పాత్రలో నటించనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×