E-Paper
Advertisement

BSNL Notification: బీఎస్ఎన్‌ఎల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో, ఇంకెందుకు ఆలస్యం

BSNL Notification: బీఎస్ఎన్‌ఎల్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

భారత ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (SET) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉన్న 120 ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2026 నుండి మార్చి 7, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ముఖ్యమైన తేదీలు.. 

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 5

Advertisement

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 7

పోస్టులు – ఖాళీలు.. 

టెలికం స్ట్రీమ్ లో 95 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

ఫైనాన్స్ స్ట్రీమ్ లో 25 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

అభ్యర్థులు బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ bsnl.co.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత, అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తదుపరి దశలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ (Document Verification) నిర్వహిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోని పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

అఫీషియల్ వెబ్ సైట్: bsnl.co.in

విద్యార్హతలు.. 

ఈ నోటిఫికేషన్‌లో ప్రధానంగా రెండు విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

టెలికాం స్ట్రీమ్: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ (IT), ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో కనీసం 60% మార్కులతో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ (BE/B.Tech) పూర్తి చేసి ఉండాలి.

ఫైనాన్స్ స్ట్రీమ్: అభ్యర్థులు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) అర్హత కలిగి ఉండాలి.

వయస్సు వివరాలు.. 

మార్చి 7, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి మరియు గరిష్టంగా 30 ఏళ్ల లోపు ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు (SC/ST/OBC/PwD) వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

టెలికాం రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఇదొక సువర్ణావకాశం. అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వెబ్‌సైట్ పోర్టల్ ప్రారంభం కాగానే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. వేతనం, శిక్షణ కాలం, ఇతర సౌకర్యాల గురించి మరిన్ని వివరాల కోసం నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని బీఎస్‌ఎన్‌ఎల్ కోరింది.

ALSO READ: Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×