E-Paper
Advertisement

Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు.. తెలంగాణ నీళ్లపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు! 

Harish Rao: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారు.. తెలంగాణ నీళ్లపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు! 
Advertisement

Harish Rao:  బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీటిపారుదల శాఖ సమావేశం తెలంగాణకు ‘మరణ శాసనం’ వంటిదని, ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను తాకట్టు పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ‘జల ద్రోహం’గా అభివర్ణించారు. ఏపీ ప్రతిపాదించిన ‘నల్లమల సాగర్’ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు చెందాల్సిన 200 టీఎంసీల నీటిని గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని, దీనికి రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన ఆదిత్యా నాథ్ దాస్ వంటి వారిని చర్చలకు పంపడం అంటే రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని హరీశ్ రావు విమర్శించారు. ఏపీ ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో తాము పెట్టిన కండీషన్లకు కేంద్రం లేదా ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ లభించిందో ప్రజలకు వెల్లడించాలని కోరారు. కేసీఆర్ హయాంలో గోదావరిపై అనేక ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఒక్క డీపీఆర్ (DPR) కూడా పంపలేకపోగా, ఉన్న అనుమతులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి కల్పించిందని ధ్వజమెత్తారు.

Advertisement

కేసీఆర్ పాలనలో తెలంగాణ 32 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందని, ఎకనామిక్ సర్వే రిపోర్టే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ద్వారా సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వమే కొనియాడిందని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ నీటిని ఏపీకి ధారపోస్తూ చంద్రబాబుకు ‘గురుదక్షిణ’ చెల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సోయి లేని రేవంత్ పాలనలో రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు.

Read Also: Phone Tapping Case: మరోసారి కేసీఆర్‌కు సిట్ నోటీసులు! విచారణ హైదరాబాద్‌లో, కోర్టుకి వెళ్లేందుకు?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×