E-Paper
Advertisement

Railway Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది.. రైల్వేలో రాతపరీక్ష లేకుండానే జాబ్, త్వరపడండి

Railway Recruitment: నిరుద్యోగులకు సువర్ణవకాశం ఇది.. రైల్వేలో రాతపరీక్ష లేకుండానే జాబ్, త్వరపడండి
Advertisement

రైల్వే లో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.  సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు.. యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 51 ఖాళీల నియామకం కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) తాజాగా అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. 1961 అప్రెంటిస్ చట్టం నిబంధనల మేరకు ఈ ఎంపికలు జరగనున్నాయి.. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం.

దరఖాస్తు విధానం: 

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానాన్ని మాత్రమే అనుసరించాలి.

ముఖ్య తేదీలు: 

Advertisement

2026 మార్చి 10న ఉదయం 11:00 గంటల నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 9, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోబడవు.

విద్యార్హతలు: 

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికేట్ కలిగి ఉండటం తప్పనిసరి.

వయస్సు: 

వయోపరిమితిని గమనిస్తే.. 2026 మార్చి 10 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: 

ఈ నియామకాల్లో మరో ప్రధానాంశం ఎంపిక విధానం. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి, ఐటీఐ కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అత్యధిక మార్కులు సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. జనరల్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ (PwBD) తో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ www.rrccr.com సందర్శించవచ్చు. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి.. అన్ని పత్రాలను సిద్ధం చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrccr.com/

ALSO READ: IOCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐవోసీఎల్‌లో 473 అప్రెంటిస్ పోస్టులు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×