
God Movie On OTT : తమిళ్ స్టార్ హీరో జయం రవి,లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో వచ్చిన తని ఒరువన్ సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అవ్వడమే కాకుండా.. ఈ జంట ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ మూవీకి జయం రవి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఒక ప్లస్ అయితే నయనతార అందం ,అభినయం మూవీకి మరింత క్రేజ్ తెచ్చింది. స్క్రీన్ ప్లే దగ్గర నుంచి డైరెక్షన్ వరకు ..కథ నుంచి కథనం వరకు ప్రతి ఆస్పెక్ట్ లో సినిమా అద్భుతంగా ఉండడంతో మంచి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఇక తిరిగి వీరిద్దరి కాంబోలో వచ్చిన సైకో మూవీ ‘ఇరైవన్’ను తెలుగులో ‘గాడ్’పేరుతో డబ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈనెల 13న విడుదలైన ఈ చిత్రం అటు తెలుగు ఇటు తమిళ్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ మూవీలో కూడా జయం రవి, నయనతార మరోసారి తమ సూపర్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.ఈ హైఓల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కు సుధన్ సుందరం, జి.జయరాం, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మాణ సారథ్యం వహించగా ఐ.అహ్మద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
ఈ మూవీ టీం నుంచి సరికొత్త అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేమిటంటే..ఇరైవన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పాపులర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ నెట్వర్క్ సొంతం చేసుకుంది.ఇరైవన్.. గాడ్ ఈనెల 26 నుంచి తమిళ్, తెలుగుతోపాటుగా మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ మూవీలో జయం రవి అర్జున్ పాత్రను పోషించగా.. అతని ఫ్రెండ్ నరేన్ రామ్ క్యారెక్టర్ లో ఆండ్రూ నటించాడు. సైకో క్రైమ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది.
ఒక సైకో కిల్లర్ ను పట్టుకునే నేపథ్యంలో అర్జున్ అతని ఫ్రెండ్ ని పోగొట్టుకుంటాడు. ఈ విషయంతో విరక్తి కలిగి డిపార్ట్మెంట్ కే దూరంగా అయిన అర్జున్.. తిరిగి ఆ సైకో తన సన్నిహితులపై టార్గెట్ చేయడంతో పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన అర్జున్.. నగరంలో పది మంది అమ్మాయిలను దారుణంగా చంపిన సైకో కిల్లర్ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు. స్మైలింగ్ బ్రహ్మ.. అసలు సైకోగా ఎందుకు మారాడు. ఈ చిత్రంలోని ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ తో ముందుకు సాగుతుంది. మాంచి థ్రిల్లింగ్ మూవీస్ మీకు ఇష్టమైతే తప్పకుండా ఈ మూవీ చూసేయండి