నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పరిశోధన రంగంలో ఆసక్తి గల అభ్యర్థుల కోసం ఈ పోస్టులను కేటాయించింది. మొత్తం 27 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అవసరాల మేరకు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ నోటిఫికేషన్ ద్వారా రిసెర్చ్ అసోసియేట్ సహా పలు రకాల ప్రాజెక్టు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ప్రాజెక్టు అసోసియేట్-1 విభాగంలో 14 పోస్టులు ఉన్నాయి. అలాగే ప్రాజెక్టు అసోసియేట్-2 విభాగంలో 9 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రిసెర్చ్ అసోసియేట్ ఒకటి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒకటి. ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ విద్యార్హతలకు తగిన పోస్టును ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ లేదా ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ లేదా ఎంటెక్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కొన్ని పోస్టులకు పీహెచ్‌డీతో పాటు ఎంఫార్మసీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి. విద్యార్హతల్లో సాధించిన మార్కులు. అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు.
వయస్సు: అభ్యర్థుల వయసు ఇంటర్వ్యూ తేదీ నాటికి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
జీతం: ఎంపికైన వారికి నెలకు గౌరవ వేతనం కింద మంచి శాలరీ చెల్లిస్తారు. రిసెర్చ్ అసోసియేట్‌కు గరిష్టంగా రూ. 58,000 అందజేస్తారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ. 42,000 ఇస్తారు. ప్రాజెక్ట్ అసోసియేట్-1, 2 పోస్టులకు రూ. 25,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 విభాగానికి రూ. 20,000 చెల్లిస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక నిర్వహిస్తారు. మే 5 అలాగే మే 6వ తేదీల్లో ఉదయం నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు సహా జిరాక్స్ కాపీలతో వేదికకు చేరుకోవాలి.
ఇంటర్వ్యూ ప్లేస్: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో గల ఐఐసీటీ ప్రాంగణంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంట తెచ్చుకోవాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ పరిశీలించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.iict.res.in/
ALSO READ: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 599 మార్కులు సాధించిన విశాఖ విద్యార్థి!