Big Stories

Indian Navy Recruitment 2024: ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టులు.. పూర్తి వివరాలివే..

Indian Navy Agniveer SSR Recruitment 2024: ఇంటర్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీగా కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన అవివాహిత పురుష, మహిళలు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఖాళీల భర్తీకి సంబంధించి వయస్సు, పరీక్షా విధానం, జీతం వంటి మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ముఖ్యమైన తేదీలు..
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 13వ తేదీన ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మే 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.

- Advertisement -

విద్యార్హతలు..
కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సజ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సు, ఇంజినీరింగ్ డిప్లొమా, తత్సమాన కోర్సుల్లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఉత్తీర్ణులైన ఉండాలి.

వయస్సు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 01-11-2023 నుంచి 30-04-2007 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి.

మెడికల్ స్టాండర్డ్స్
పురుష, మహిళల ఎత్తు 157కంటే ఎక్కువ ఉండాలి.

పరీక్ష ఫీజు..
దరఖాస్తు ఫీజు రూ.550లను ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: ఐపీపీబీలో 54 ఐటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిక విధానం
స్టేజ్-1.. కంప్యూటర్ ఆధారిత ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి స్టేజ్-2లో ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం https://indiannavy.nic.in/ అధికారిక వెబ్ సైట్ చూడగలరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News