Big Stories

Education Loan : ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు..!

Education Loan

Education Loan For Abroad Studies : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. 2022లో 7.7 లక్షల మంది మన విద్యార్థులు విదేశీ విద్యకై వెళ్లగా, అమెరికా వెళ్తున్న వారి సంఖ్య ఏటా 19 శాతం మేర పెరుగుతోంది. మెరుగైన ప్రమాణాలు, ఉపాధి లభ్యత కారణంగా దిగువ మధ్యతరగతి విద్యార్థులు సైతం విద్యారుణం అండతో విదేశీవిద్యకై వెళుతున్నారు. అయితే.. విద్యారుణం తీసుకునే ముందు విద్యార్థులు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా అనుకున్న కోర్సును పూర్తి చేయొచ్చు.

- Advertisement -

బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ ఇప్పుడు విద్యా రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా రుణం తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలేమిటంటే..

- Advertisement -

ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు.. దరఖాస్తు విధానం, రుణం పొందేందుకుండే నియమాలు, లోన్ మంజూరుకు పట్టే సమయం, ఏ వర్సీటీలకు త్వరగా లోన్ వస్తుందనే వివరాలు తెలుసుకోవాలి.

మీరు అడ్మిషన్ ఆశిస్తున్న విదేశీ వర్సిటీల్లో చదివే విద్యార్థులతో మాట్లాడితే అక్కడి ఖర్చుల మీద స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇటీవలి కాలంలో ఏమైనా ఖర్చులు పెరిగితే ముందుగా తెలుస్తుంది.

వర్సిటీ అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ప్రయాణ ఖర్చులు, వసతి, ల్యాప్‌టాప్ మొదలు స్టడీ మెటీరియల్ వరకు అవసరమయ్యే ప్రతి ఖర్చునూ లెక్కించుకొని ఎంత లోన్ అవసరమవుతుందనే ఒక అంచనాకు రావాలి.

లోన్ బ్యాంకులో తీసుకోవాలా? లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవాలో నిర్ణయించుకోండి. లోన్ మీద వడ్డీ ఎంత? వారు అందించే ఇతర ప్రయోజనాలేమిటి? తిరిగి చెల్లించే క్రమంలో వారి నియమాలేంటి పూర్తిగా తెలుసుకోవాలి.

కొన్ని కాలేజీలు, వర్సిటీలకు కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందాలుంటాయి. దీనివల్ల సదరు విద్యాసంస్థల్లో అడ్మిషన్ ఖాయమైతే.. సదరు బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారే సులభంగా లోన్ అందిస్తారు.

చదువు పూర్తయిన తర్వాత ఎంతటైంలో జాబ్ వస్తుంది? వస్తే.. అప్పటి ఖర్చులు పోను, కుటుంబ బాధ్యతలు పోను, ఎంత మొత్తం లోన్‌ కట్టేందుకు కేటాయించగలము? వంటి అంశాలను లోన్ అందించే సంస్థతో ముందుగా చర్చించాలి. మారటోరియం వ్యవధిలో విద్యార్థులు పాక్షిక వడ్డీని చెల్లించటం వల్ల లోన్‌ మీద వడ్డీ కూడా తగ్గుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News