
Fine Arts Career After Inter : మంచి సృజనాత్మకత ఉంటే అది ఎప్పటికైనా ఏదో ఒక నూతన ఆవిష్కరణకు దారిస్తుంది.పెయింటింగ్, యానిమేషన్, డిజైన్ వంటి చాలా కోర్సులు ఫైన్ ఆర్ట్స్‌లో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే భవిష్యత్ అవకాశాలను అందుకోవచ్చు. పైగా ఇప్పటి విద్యార్థుల్లో కళలు, ఆర్ట్స్ వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువ. మరి ఫైన్ ఆర్ట్స్‌కు సంబంధించిన కోర్సులేవో చూద్దామా!
కోర్సుల వివరాలు ఇలా..
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బెటర్ కోర్సు చేయాలనుకుంటే.. అండర్ గ్రాడ్యుయేషన్‌లో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA) చేయవచ్చు. ఈ కోర్సులకు కాలవ్యవధి నాలుగేళ్లు. కొన్ని సంస్థలు BA ఫైన్ ఆర్ట్స్ పేరుతో మూడేళ్ల కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సు తర్వాత పీజీ, పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు.పైగా ఇలాంటి కోర్సులకే ఇప్పుడు డిమాండ్ ఉంది.
సంస్థలు..
బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్స్, స్కల్ప్‌చర్ వంటి కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు అందిస్తున్నాయి.హైదరాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.. ఫైన్ ఆర్ట్స్‌కి ప్రత్యేకమైనది. ఏపీలోని కడపలో డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉంది.