Railway Jobs: రైల్వేలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా..? రైల్వేలో ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నారా..? రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులున్నాయి? అనే ముఖ్యం కాదు. ఒక్క పోస్ట్ ఉన్న మనదే అన్న దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయితే విజయం మీదే. ఎన్ని పోస్టులున్నా ఉద్యోగానికి అప్లై చేసుకుని.. సీన్సియర్ గా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
నార్తర్న్ రైల్వేలో స్కౌట్స్, గైడ్స్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ అండ్ డీ ఉద్యోగాలను భర్తీ అప్లికేషన్ లు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 22 నుంచి జూన్ 22 మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వెకెన్సీల సంఖ్య: 23
నార్తర్న్ రైల్వేలో గ్రూప్ సీ అండ్ గ్రూప్ డీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు
గ్రూప్ సీ పోస్టులు: 5
గ్రూప్ డీ పోస్టులు: 18
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా ఐటీఐ పాసై ఉండాలి. ఉద్యోగం అనుభవం కూడా చూస్తారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. గ్రూప్- సీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. గ్రూప్- డీ ఉద్యోగాలకు 18 నుంచి 33 ఏళ్ల వయస్సు ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 22
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 22
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://rrcnr.org/
అర్హత ఉండి ఆసక్తి ఉన్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది.
ALSO READ: NIACL Recruitment: ఇది సువర్ణవకాశం, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 23
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 22
ALSO READ: APMSRB Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు, జీతం రూ.1,10,000