BigTV English

Suhasini : ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయా..

Suhasini : ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయా..

Suhasini: తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్టార్ సుహాసిని. కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తెలుగులోనే కాక ఇతర దక్షిణాది భాషల లో సినిమా చిన్నా పెద్ద తేడా లేకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మణిరత్నం ను పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన సుహాసిని అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్స్ లో తెలుగులో నటిస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రానున్న థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె తన మ్యారేజ్ లైఫ్, గురించి మణిరత్నంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


నేను చాల రోజులకి పుట్టింటికి వచ్చాను ..

టాలీవుడ్ లో బడా హీరోలు అందరితో సుహాసిని నటించారు. చిరంజీవితో ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. రాక్షసుడు మూవీలో చిరంజీవితో సుహాసిని నటించారు. ఈ చిత్రంలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే పాట ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇక మణిరత్నం దర్శకుడిగా కమలహాసన్, శింబు త్రిష ఐశ్వర్య లక్ష్మీ, ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా థగ్ లైఫ్ . ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుహాసిని మాట్లాడుతూ.. నాకు మిమ్మల్ని చూస్తుంటే పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను కానీ, లేకపోతే ఇక్కడే ఉండిపోయే దాన్ని, చాలా రోజుల తర్వాత పుట్టింటికి వచ్చాను. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే నా పాట నాకే గుర్తొస్తుంది. ఒకవైపు మా బాబాయ్ కమలహాసన్, మరోవైపు నా భర్త మణిరత్నం, వీరిద్దరితో కలిసి ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీరిద్దరూ కలిసి టంగ్ లైఫ్ మూవీ తో మీ ముందుకు జూన్ 5 న వస్తున్నారు. వారందరిని మీరు ఆశీర్వదించండి.అని సుహాసిని తెలిపారు.


ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయా..

నాయకన్ సినిమా మీరు ట్రావెల్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని సుమా అడగ్గా.. నాయకన్ సినిమా అప్పటికి పెళ్లవ్వలేదు, ఆ సినిమా అప్పటికి ఆయన నాకు తెలియదు. ఏదో కొత్త డైరెక్టర్ అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేసి, 15 నిమిషాలు ఆయనతో మాట్లాడాను. నేను ఆయనతో ఎందుకు మాట్లాడాను ఇంతసేపు అని అనిపించింది. తెలుగు లో ఈ మూవీ నాయకుడు పేరుతో రిలీజ్ అయింది. ఆయన బెస్ట్ ఫిలిం అదే, నాయకన్ మా బాబాయ్ సినిమాల్లో నాకు అది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. ఇంచుమించు మీరు ప్రేమలో పడడానికి ఆ సినిమానే కారణం అంటారా అని సుమ అనటం తో, అవును డెఫినెట్గా అదే,ఆ సినిమా చూసే మణిరత్నంతో ప్రేమలో పడిపోయాను . ఆ సినిమా చేయకపోయి ఉంటే ఆయన లైఫ్ లో సుహాసిని లేదు. నాయకన్ చేశారు కాబట్టే ఆయన లైఫ్ లోకి నేను వెళ్ళాను. ఇందుకు కమల్ కి కూడా థాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ మాట్లాడే మణిరత్నం మీకు ఎలా ప్రపోజ్ చేశారు అని అడగ్గా.. ఇప్పుడు ఈ టైం లో అవన్నీ ఎందుకు వదిలేయండి, అదంతా ఒక మెమరీ, అని సుహాసిని అంటుంది.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×