E-Paper
Advertisement

SSC Recruitment: 25487 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? ఇంకా ఎనిమిది రోజులే.. APPLY NOW

SSC Recruitment: 25487 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? ఇంకా ఎనిమిది రోజులే.. APPLY NOW
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

నోట్: దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 31

Advertisement

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), అస్సాం రైఫిల్స్ (AR) లలో కానిస్టేబుల్ (జీడీ), రైఫిల్‌మ్యాన్‌ (జీడీ) పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 25,487

Advertisement

ఈ నోటిపికేషన్ లో కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు- వెకెన్సీ వివరాలు:

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 14,595 పోస్టులు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF): 5,490 పోస్టులు
సశస్త్ర సీమా బల్ (SSB): 1,764 పోస్టులు
అస్సాం రైఫిల్స్ (AR): 1,706 పోస్టులు
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1,293 పోస్టులు
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 616 పోస్టులు
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 23 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్షలో 2026 జనవరి 1 నాటికి లేదా అంతకు ముందు పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

వయస్సు: 2026  జనవరి 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అంటే 2003 జనవరి 2 కన్నా ముందు.. 2008 జనవరి 1 తర్వాత అయినా జన్మించి ఉండకూడదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండను.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. https://ssc.gov.in/ లో ఓటీఆర్ పూర్తి చేయాలి..

వెబ్ సైట్: https://ssc.gov.in/

ఉద్యోగ ఎంపిక విధానం:  కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE),  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET),  వైద్య పరీక్ష (DME)/ వైద్య పరీక్ష (RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), CBE లోని మెరిట్, అభ్యర్థులు ఎంచుకున్న ఫోర్స్ ప్రాధాన్యత ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 డిసెంబర్ 1

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 31

ఆన్ లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 2026 జనవరి 1

ఎగ్జామ్ తేదీలు: 2026 ఫిబ్రవరి, మార్చి

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×