BigTV English
Advertisement

Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్

Constable Jobs: పదితో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 81,000 జీతం.. డోంట్ మిస్

Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 23న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోట్: దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 23


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1121 పోస్టులు

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు వెకెన్సీలు:

హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు: 1121 (మొత్తం ఉద్యోగాలు)

రేడియో ఆపరేటర్: 910 పోస్టులు

రేడియో మెకానిక్: 211 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 24

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 23

జీతం: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bsf.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.81వేల వరకు వేతనం లభించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: DSSSB Recruitment: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 1180 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. జీతం లక్షకు పైనే..

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1121

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 23

జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం

Related News

Constable: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేశారా…? ఇంకా నాలుగు రోజులే గడువు, డోంట్ మిస్

Intelligence Bureau: ఐబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, నెలకు రూ.1,42,400 జీతం

AP TET 2025: ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. సిలబస్, పరీక్ష విధానం ఇలా

Inter exams: స్టూడెంట్స్‌కు బిగ్ అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

AP SSC Exams 2026: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. మార్చి 16 నుంచి పరీక్షలు.. రూట్ మ్యాప్ తో హాల్ టికెట్లు

AIIMS: మంగళగిరిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,68,900 జీతం, ఇంకా 2 రోజులే సమయం

BEL Jobs: బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్.. అక్షరాల రూ.90వేల జీతం భయ్యా, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

Big Stories

×