UAE Vs IND : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ యూఏఈ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 13వ ఓవర్ లో యూఏఈ బ్యాటర్ సిద్ధిఖీని కీపర్ సంజు శాంసన్ స్టంప్ ఔట్ చేశాడు. అతను క్రీజ్ బయటే ఉండటంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చారు. కానీ సూర్య అప్పీల్ వెనక్కీ తీసుకోవడంతో సిద్ధిఖీ బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ మనస్సులు గెలిచారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ICC : ఐసీసీ సంచలన నిర్ణయం…ఇకపై మహిళలే అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు
ఈ మ్యాచ్ లో భారత్ మంచి శుభారంభం చేసింది. యూఏఈ పై 58 పరుగుల లక్ష్యాన్ని జట్టు కేవలం 27 బంతుల్లోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 30 పరుగులు చేసి ఔట్ అయ్యారు. శుబ్ మన్ గిల్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముఖ్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది భారత్. యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి 8 వికెట్లను 28 పరుగులకే కోల్పోయింది. ఓపెనర్ అలీషాన్ షరాపు 22 పరుగులు, కెప్టెన్ మహ్మద్ వసీం 19 పరుగులు చేసారు. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే 3 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరపున అభిషేక్ శర్మ 30 పరుగులకు ఔట్ అయ్యారు. ఇన్నింగ్స్ బంతులు మిగిలి ఉండగానే భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. దుబాయ్ లో యూఏఈ పై టీమిండియా కేవలం 27 బంతుల్లో అంటే 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
2021లో దుబాయ్ లో స్కాట్లాండ్ పై భారత్ 81 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. టీమింఇయా కి ఇది రెండో అతి పెద్ద విజయం. 2024టీ20 వరల్డ్ కప్ లో అంటిగ్వాలో ఇంగ్లాండ్ కేవలం 19 బంతుల్లో ఒమన్ ను ఓడించింది. అప్పుడు 101 బంతులు మిగిలి ఉన్నాయి. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ లో దుమ్ములేపిన అభిషేక్ శర్మలపై సూర్య కుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. ” వాస్తవానికి పిచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ వికెట్ ఒకేలా ఉంది. మేము ప్రతీ మ్యాచ్ లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ను కొనసాగించాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్ లో మేము అన్ని విభాల్లో మెరుగ్గా రాణించాం. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాదు.. ప్రస్తుతం దుబాయ్ లో వాతావరణం చాలా వేడిగా ఉంది” అని తెలిపారు సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
#DPWorldAsiaCup2025 | #INDvsUAE
Captain Suryakumar Yadav's heart winning gesture.
– Calls the batsman back to the crease and withdraws the appeal of the wicket.pic.twitter.com/Yj3Decu5mR
— Kshitij (@Kshitij45__) September 10, 2025