ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రోజు రోజుకు చిత్ర విచిత్రమైన టూల్స్ పుట్టుకొస్తున్నాయి. వాటిలో అదిరిపోయే ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసుకుని నెటిజన్లు తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి మరో క్రేజీ టూల్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోటో ఎడిటింగ్ టూల్ తో అదిరిపోయే3D ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. వీటిని నెట్టింట పోస్టు చేస్తూ హ్యాపీగా ఫీలవతున్నారు. గత కొద్ది రోజులు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ చూసినా ఇవే ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు, ఈ ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలను ఎలా క్రిట్ చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నానో బనానా అనేది ఓ ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్. గూగుల్ జెమినీ యాప్ లోని ఎడిటింగ్ టూల్ కు లేటెస్ట్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. దీనిని జెమిని 2.5 ప్లాష్ ఇమేజ్ మోడల్ ఆధారంగా రూపొందించారు. దీని ద్వారా కేవలం సెకెన్ల వ్యవధిలో అద్భుతమైన 3D ఫోటోలను క్రియేట్ చేసుకోవచ్చు. నచ్చిన వ్యక్తి ఫోటోను అప్ లోడ్.. 3D ఇమేజ్ అని చెప్తే చాలు.. క్షణాల్లోనే అందమైన నానో బనానా 3D ఫోటో రెడీ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్, నైపుణ్యం అవసరం లేదు. సింపుల్ గా ఫోటోను అప్ లోడ్ చేసి ప్రాంఫ్టింగ్ ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ టూల్ దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచింది.ఇప్పటి వరకు ఏకంగా 200 మిలియన్ల మంది ఈ టూల్ ద్వారా 3D ఫోటోలు క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ టూల్ నుఉపయోగించి నచ్చిన ఫోటోలను రూపొందించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా నానా బనానా 3D ఫోటోను మీకూ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు నచ్చిన ఫోటోను అద్భతంగా క్రియేట్ చేసుకోవచ్చు.
⦿ నానో బనానా 3D ఫొటోను క్రియేట్ చేసుకోవాలనుకునే వారు ముందుగా Google Gemini వెబ్ సైట్ లేదంటే యాప్ ను ఓపెన్ చేయాలి.
⦿ ఆ తర్వాత Try Nano Banana అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ అప్పుడు మీకు + అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఫోటోను అప్ లోడ్ చేయాలి.
⦿ ఆ తర్వాత ప్రాంప్ట్ ఇవ్వాలి. Prompt: “Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.”
⦿ ప్రాంప్ట్ ప్రకారం మీకు నచ్చిన 3D ఇమేజ్ రెడీ అవుతుంది. ఆ ఫోటోను మీరు డౌన్ లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు.
Read Also: డేటింగ్‌లో కూడా ఏఐ.. 50 ప్రశ్నలకు సమాధానమిస్తేనే రొమాన్స్