BigTV English

IBPS Recruitment 2024: IBPSలో 4455 ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి 5 రోజులే ఛాన్స్ !

IBPS Recruitment 2024: IBPSలో 4455 ఉద్యోగాలు.. అప్లై చేసుకోవడానికి 5 రోజులే ఛాన్స్ !

IBPS Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లతో పాటు మేనేజ్ మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


పూర్తి వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 4455

  • బ్యాంకుల వారిగా వివరాలు..
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా: 885
  • కెనరా బ్యాంక్ : 750
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000
  • ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ : 206
  • పంజాబ్ సేషనల్ బ్యాంక్ : 200
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ : 360

విద్యార్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: ఆగస్టు 1, 2024 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు: జనరల్ , ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం : ప్రిలిమినరీ ,మెయిన్స్ పరీక్షలు, ఇంటర్యూ, ధ్రువపత్రాల పరిశీలన , మెడికల్ ఇగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 1, 2024

ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 28,2024

 

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×