BigTV English

Revu Movie Review: గంగమ్మ తల్లిని నమ్మకున్న గంగపుత్రుల కథ.. రేవు మూవీ ఎలా ఉందంటే.. ?

Revu Movie Review: గంగమ్మ తల్లిని నమ్మకున్న గంగపుత్రుల కథ.. రేవు మూవీ ఎలా ఉందంటే.. ?

Revu Movie Review: ఈ మధ్య చిన్న చిన్న సినిమాలు  మంచి విజయాలను అందుకుంటున్నాయి.  ఒకప్పుడు చిన్న కథలను నిర్మించడానికి భయపడే నిర్మాతలు.. ఇప్పుడు ఏరికోరి చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. అందుకు కారణం కథలో బలం ఉంటే ప్రేక్షకులను ఆదరిస్తారనే నమ్మకం బలపడడం. ప్రతి శుక్రవారం  పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం మరో చిన్న సినిమా.. థియేటర్ లో రిలీజ్ అయ్యింది. అదే రేవు.


వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్, అజయ్ నిడదవోలు, సుమేష్ మాధవన్ ముఖ్య పాత్రల్లో హరినాథ్ పులి దర్శకత్వం వహించిన చిత్రం రేవు. ఈ సినిమాను  మురళి గింజపల్లి, నవీన్ పారుపల్లీ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు రిలీజ్ చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈరోజు రేవు  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా కథ, కథనం  ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా.. ? అనేది  తెలుసుకుందాం.

కథ:  రేవు అంటే సముద్ర తీరం అని అర్ధం.  సముద్రాన్ని నమ్ముకున్న ఇద్దరు గంగపుత్రుల కథనే ఈ రేవు. పాలరేవు అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు అయిన అంకాలు(వంశీ రామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్ నిడదవోలు) చేపలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చేపలు పడతారు అనే పోటీ మొదలవుతుంది. ఆ పోటీ కాస్తా పెద్ద గొడవకు దారితీస్తుంది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి జీవితాల్లోకి ధనవంతుడు అయిన నాగేసు( ఏపూరి హరి) అడుగుపెడతాడు. అతడి వలన ఆ ఇద్దరి యువకుల జీవితాలు ఎలా మారాయి. నాగేసు కు, సామ్రాజ్యం( స్వాతి భీమిరెడ్డి), సాంబ శివ (సుమేష్ మాధవన్) కు ఉన్న సంబంధం ఏంటి.. ? అనేది మిగతా కథ.


విశ్లేషణ: చిన్న చిన్న సినిమాలకు కథలే బలం. ఈ సినిమాకు కూడా కథనే బలం. సముద్రపు ఒడ్డున మత్స్యకారులజీవితాలను ఎంతోమంది.. ఎన్నో సినిమాల్లో చూపించారు. రేవు కూడా అందులో ఒకటి. ఉదయం లేచిన దగ్గరనుంచి సముద్రంతో మత్స్యకారులకు ఉన్న అనుభందం, వారు పడే కష్టాన్ని డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదాగా మొదలైన పోటీ.. వారి మధ్య ఉన్న ఇగోను రెచ్చగొట్టి యెంత  దూరం తీసుకెళ్లింది అనేది చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే కథలో బలం ఉన్నా.. చెప్పే విధానంలో డైరెక్టర్ తడబడ్డాడు.

ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో నడిపించిన దర్శకుడు.. సెకండ్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ తో బోర్ కొట్టించేలా చేశాడు. జాలరిల జీవితాలు.. వారి బాధలను ఎంతో హృద్యంగా చూపించిన  డైరెక్టర్.. క్లైమాక్స్ లో ఇంకొంచెం గట్టిగా శ్రద్ద  పెడితే బావుండేది అనిపిస్తుంది. కానీ, ఈ సినిమా చూస్తే ఒక కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా అని చెప్పడం కష్టం. అంతలా అతని టేకింగ్ ఉంది. మొత్తంగా రేవు ఒక  మంచి గ్రామీణ నేపథ్యంలో సాగిపోయే ఫీల్ గుడ్ కథ అని చెప్పొచ్చు.

నటీనటులు: నటీనటులు అందరు కొత్తవారైనా కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా వంశీ రామ్ పెండ్యాల, అజయ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎమోషన్ సీన్స్ లో ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించారు. స్వాతి భీమిరెడ్డి, హేమంత్ ఉద్ధవ్,సుమేష్ మాధవన్ తమతమ  పాత్రలకు న్యాయం చేశారు. జాన్ కే జోసెఫ్ సంగీతం ఆకట్టుకుంటుంది.

ట్యాగ్ లైన్: రేవు..  కొద్దిగా బోర్ కొట్టినా పర్లేదు చూడొచ్చు

రేటింగ్: 2.75

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×