E-Paper
Advertisement

Catch Drop: భలే క్యాచ్ డ్రాప్: ఏడుసార్లు పట్టుకుని వదిలేశాడు !

Catch Drop: భలే క్యాచ్ డ్రాప్: ఏడుసార్లు పట్టుకుని వదిలేశాడు !
Advertisement

Catch Drop Viral Video: క్రికెట్ మ్యాచ్ ల్లో ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని కోపం తెప్పిస్తుంటాయి, కొన్ని చిరాకు తెప్పిస్తుంటాయి, కొన్ని అయ్యో అనిపిస్తుంటాయి, కొన్ని బాధ కలిగిస్తుంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఒక క్యాచ్ డ్రాప్ చేస్తే, అక్కడ మ్యాచ్ ని సీరియస్ గా చూసే అభిమానులు, జట్టు కెప్టెన్, ఇక బాల్ వేసిన బౌలర్ పరిస్థితి అయితే చెప్పనలవి కాదు.. వారు చూసే చూపులు మామూలుగా ఉండవు.

కానీ ఇప్పుడు ఒక ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా సరే, ఎవరికి కోపం రావడం లేదు. హాయిగా నవ్వుకుంటున్నారు. భలే డ్రాప్ చేశాడ్రా అంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయి కూర్చుంది. మరి విషయం ఏమిటంటే..

Advertisement

ఇంగ్లాండ్ లోని విలేజ్ క్రికెట్ లో భాగంగా సందర్ స్టీడ్ క్లబ్, మెర్టన్ బోర్స్ ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. మ్యాచ్ సీరియస్ గా జరుగుతోంది. మెర్టన్ బోర్స్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ సమయంలో బ్యాటర్ కొట్టిన బాల్ గాల్లోకి ఎగిరింది. అక్కడే లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న సందర్ స్టీడ్ క్లబ్ ఫీల్డర్ స్టూ ఎల్లెరీ దాన్ని అందుకున్నాడు. కానీ వెంటనే జార వదిలేశాడు. మళ్లీ గబుక్కున పట్టుకున్నాడు. మళ్లీ వదిలేశాడు.

Also Read: మరో హీరో ఎందుకు? నేనే చేస్తా: ద్రవిడ్

Advertisement

అలా ఏడుసార్లు బంతితో చైనా కుంగ్ ఫూ ఫైటర్లు చేతితో, కాలితో ఆడినట్టు ఆడి, పట్టుకుని, వదిలి, పట్టుకుని.. చివరికి వదిలేశాడు. అయితే ఈ క్యాచ్ విన్యాసాన్ని చూసిన అందరూ ఒకటే నవ్వడం, చివరికి ప్రత్యర్థి బ్యాటర్లు, తమ సొంత జట్టు బౌలర్, కెప్టెన్ అంతా కూడా నవ్వులు చిందించారు.

అందరూ ఎందుకిలా నవ్వుతున్నారని క్యాచ్ వదిలేసిన వీరుడు స్టూ ఎల్లెరీ.. మ్యాచ్ తర్వాత రీప్లే చూసి, తను కూడా నవ్వుకున్నాడు. అయితే నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అలాంటివాటిలో కొన్ని ఇవిగో.

నీ ఫీల్డింగ్ భయ్యా..పాకిస్తాన్ ని గుర్తుకు తెచ్చింది.
గ్రామస్థాయి క్రికెట్ చరిత్రలో వదిలేసిన గొప్ప క్యాచ్ ఇదే.
ఫీల్డర్ చాలా గొప్పగా క్యాచ్ అందుకున్నాడు.
అంతకన్నా గొప్పగా వదిలేశాడు.
క్యాచ్ వదిలేయడంలో తను విజయం సాధించాడు.

ఇలా వస్తూనే ఉన్నాయి. మొత్తానికి నెట్టింట ఇది బాగా వైరల్ కావడంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు.

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×