IIT Student Protest: ఐఐటీ గౌహతిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోని రీసెర్చ్ స్కాలర్లు మొదలు బీటెక్ విద్యార్థులకు వరకు అందరూ భారీ నిరసనలు చేపట్టారు. రాత్రి వేళ కూడా విద్యార్థుల నిరసనలు కంటిన్యూ అయ్యాయి. ఉన్నట్లుండి స్టూడెంట్స్ ఆందోళన వెనుక అసలేం జరిగింది?
కొత్త అడ్మిషన్లు మొదలుకావడంతో ఇంజనీరింగ్ కాలేజీలు మొదలు పలు ఐఐటీలు ఫీజులు పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. పెంచిన ఫీజులను తగ్గించాలని కోరుతూ ఒక్కసారి వందలాది స్టూడెంట్స్ క్యాంపస్ ఆవరణంలో నిరసనకు దిగారు. రీసెర్చ్ స్కాలర్లు, ఎంటెక్, బీటెక్ విద్యార్థులు ఈ ఆందోళనలో పాలు పంచుకున్నారు. అత్యధిక స్థాయిలో ఫీజులు పెంచడంతో దీనికి కారణంగా తెలుస్తోంది.
గౌహతి ఐఐటీ స్టూడెంట్స్ వివరాల మేరకు.. పీహెచ్‌డీ విద్యార్థులకు ఫీజును ఒక్కసారిగా 10 వేలు పెంచారట నిర్వాహకులు. పెంచిన ఫీజును జులై-నవంబర్ సెమిస్టర్ మధ్య వసూలు చేయాలి. కానీ పెంచిన ఫీజులను జనవరి-మే సెమిస్టర్‌కు అమలు చేస్తున్నారు. దీనివల్ల రూ.34,800 ఉన్న ఫీజు.. రూ. 45 వేలకు చేరింది. కొత్తగా చేరే విద్యార్థులు ఆ లెక్కన సుమారు 92వేలు చెల్లించనున్నారు.
స్టైఫండ్ కన్నా 20 వేలు అధికంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. పార్ట్‌టైం స్కాలర్లు ఫీజు ఒకప్పుడు రూ. 2500 ఉండగా, తాజాగా 25 వేలకు పెంచినట్టు చెబుతున్నారు. రీసెర్చ్ స్కాలర్లకు హౌజ్‌రెంట్ అలవెన్స్ రావని, అదనంగా హాస్టల్ ఫీజు చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే కాకుండా మెస్ ఫీజు కూడా పెరిగాయని అంటున్నారు.
ALSO READ: నిరుద్యోగులకు శుభవార్త, అటవీశాఖలో ఉద్యోగాలు, లక్షకుపైగా జీతం
ఆరేళ్ల కిందట అంటే 2019లో 12 వేలు ఉండేది. ఇప్పుడు 22వేలు అయ్యిందని చెబుతున్నారు. ఫుడ్ క్వాలిటీ అంతగా లేకుండా ఫీజు అమాంతంగా పెంచినట్టు చెబుతున్నారు. జింఖానా ఫీజు, మెడికల్ ఫీజు, హాస్టల్ రెంట్ సైతం పెరిగాయని అంటున్నారు. స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నా ఐఐటీ నిర్వాహకులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
పీహెచ్‌డీ స్కాలర్లకు ఈ ఏడాది నుంచి ఫీజు పెంచినట్టు చెబుతున్నారు. అలాగే బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఫీజు పెంచినట్లు కొందరు చెబుతున్నారు. ఫీజుల విషయంలో గతవారం విద్యార్థులు-మేనేజ్మెంట్ మధ్య చర్చలు జరిగాయి. జులై నాలుగో వారంలో జూలై-నవంబర్‌కు సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఫీజు చెల్లించకుండా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేయరు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఐఐటీ ఎలాంటి ప్రకటన చేయలేదు. రెండు రోజుల కిందట తమ తమ విభాగాలకు వెళ్లిన రీసెర్చ్ స్కాలర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు చెల్లించకపోవడంతో రిజిస్ట్రేషన్ జరగకపోవడంత నిరసన దిగారు.
2019-20లో మెస్ ఫీజు రూ. 12,000 నుంచి రూ. 22,000 కు పెరిగింది. ఫుడ్ క్వాలిటీ మాత్రం అంతంత మాత్రమే.
జింఖానా ఫీజు రూ.1,000 నుంచి రూ.2,000కి రెట్టింపు
వైద్య రుసుము రూ.100 నుండి రూ.500లకు పెంపు
హాస్టల్ అద్దె రూ.1,000 నుండి రూ.2,000 కు పెరిగింది.
హాస్టల్ నిధులు రూ.600 నుండి రూ.2,200 కు చేరింది.
రిజిస్ట్రేషన్ రూ.1,000 నుండి రూ.2,000 కు పెంచారు.