FSO Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), 100 ఖాళీలతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు 2025 జులై 28 నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 100
ఇందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 100 పోస్టులు
విద్యార్హత: డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 28
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 17
శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తింపజేస్తారు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: రూ.32,670 నుంచి రూ.1,01,970 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్ బేస్డ్), మెయిన్స్ ఎగ్జామినేషన్, వాకింగ్ టెస్ట్ / మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్, ప్రాసెసింగ్ ఫీజు రూ.250 ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఓటీపీఆర్ (One Time Profile Registration) చేయాలి.
ALSO READ: BHEL Recruitment: 65,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే?