IIT Madras: దేశంలోని ఐఐటీ మద్రాస్ కొత్త కొత్త కాన్సెప్టులను ప్రవేశ పెడుతోంది. తాజాగా ఈ ఏడాది టాప్- 200 జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకర్లను క్యాంపస్ టూర్‌కు ఆహ్వానిస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉచిత విమాన ప్రయాణాలను అందిస్తోంది. ఈ సదుపాయం వెనుక అసలు కథేంటి?
ఐఐటీల్లో ప్రవేశాలకు జోసా ద్వారా కౌన్సెలింగ్ మొదలైంది. తొలి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఏఐ, డేటా సైన్స్‌కి విపరీతమైన డిమాండ్ నెలకొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ -2025 టాప్ ర్యాంకర్లు ఒకటి నుంచి 66 మంది విద్యార్థులు బాంబే ఐఐటీని ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ర్యాంకర్లు ఢిల్లీ ఐఐటీ వైపు మొగ్గుచూపారు. మద్రాస్ ఐఐటీకి థర్డ్ ఛాన్స్ ఇచ్చారు విద్యార్థులు.
పరిస్థితి గమనించిన మద్రాస్ ఐఐటీ.. జేఈఈ టాప్ 200 ర్యాంకర్లకు క్యాంపస్‌ని విజిట్ చేసే అవకాశం ఇచ్చింది. విద్యార్థితోపాటు పేరెంట్‌కి ఉచితంగా విమానం టికెట్ ఇవ్వనుంది. దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు క్యాంపస్ వాతావరణాన్ని చూపించడమే దీని ముఖ్య ఉద్దేశమని చెబుతోంది.
తమ క్యాంపస్‌లో పరిశోధనలు ఎలా జరుగుతున్నాయి? ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి? అనేది టాపర్లు తెలుసుకోవడం ఇదొక మొదటి అడుగు. కౌన్సెలింగ్‌లో ఎలాంటి ఐఐటీని ఎంపిక చేసుకోవాలి? ఏ కోర్సును ఎంచుకోవాలి? కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నది ఆ సంస్థ మాట.
ALSO READ: గోల్డెన్ ఛాన్స్.. మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు, జీతం అక్షరాలా 78 వేలు
ప్రతీ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు రాగానే అగ్రశ్రేణి ఐఐటీలు పూర్వ విద్యార్థుల సమావేశాలు నిర్వహస్తాయి. వివిధ పద్ధతులను ఉపయోగించి విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి పలు ఐఐటీలు. ఈసారి ఐఐటీ మద్రాస్ ఓ అడుగు ముందుకేసింది. విద్యార్థితోపాటు వారి తల్లిదండ్రుల్లో ఒకరికి విమాన ఛార్జీలను చెల్లించాలి నిర్ణయించింది.
క్యాంపస్ విజిట్‌లో భాగంగా విద్యార్థులను క్యాంపస్‌ను చూడనున్నారు. ప్రొఫెసర్లతో నేరుగా మాట్లాడవచ్చు. సలహాలు తీసుకోవచ్చు. అలాగే ప్రయోగాలు చేసే ప్రాంతాన్ని చూడవచ్చు. సీనియర్ విద్యార్థులతో ఇంటర్యాక్ట్ కావచ్చు కూడా.
విద్యా పరంగానే కాకుండా జీవితం ఎలా ఉంటుందో విద్యార్థులకు చూపించడానికి ఇదొక చక్కటి అవకాశమని చెబుతోంది. విద్యార్థులు చదువుకోవడం, అలాగే స్నేహం, ఆవిష్కరణ, సపోర్ట్ ఎలా ఉంటుందో ఆ వాతావరణాన్ని ముందుగానే చూసే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి కౌన్సెలింగ్‌కు ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు మంచి ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి.