Hair Fall Control Tips: దువ్విన ప్రతిసారీ జుట్టు రాలడం మిమ్మల్ని ఇబ్బంది బాధపెడుతుందా ? బాత్రూంలో, నేలపై జుట్టు చూసిన ప్రతిసారీ మీలో భయం, ఆందోళన పెరుగుతోందా ? నేటి బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం యొక్క ప్రభావం మొదట మన జుట్టుపై కనిపిస్తుంది. జుట్టు మూలాలు లోపలి నుండి బలహీనంగా మారినప్పుడు ఖరీదైన షాంపూలు, హెయిర్ స్పాలు కూడా పనికిరావు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటించి జుట్టు రాలడాన్ని ఆపవచ్చు. దీనికి మీరు ఎలాంటి ఖర్చు చేయాల్సి ఉండదు. ముఖ్యంగా మన అమ్మమ్మల కాలం నాటి హోం రెమెడీస్ జుట్టును బలోపేతం చేసి జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తాయి. ఇంతకీ ఆ హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె, కరివేపాకు మిశ్రమం:
కరివేపాకులను కొబ్బరి నూనెలో మరిగించి.. తర్వాత చల్లబరిచి, వారానికి రెండుసార్లు తలకు మసాజ్ చేయండి. కరివేపాకు జుట్టు మూలాలకు పోషణనిచ్చి, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టును నల్లగా చేస్తుంది. తరచుగా దీనిని జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.
ఉల్లిపాయ జ్యూస్:
ఉల్లిపాయ జ్యూస్ జుట్టు పెరుగుదలకు దివ్యౌషధం. లాంటిది. ఇందులో ఉండే సల్ఫర్ తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతే కాకుండా కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ జ్యూస్‌ను వారానికి రెండుసార్లు తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. దీనిని తరచుగా వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు ఉల్లిపాయ జ్యూస్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది.
ఉసిరి, కొబ్బరి నూనె:
ఉసిరిలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో ఉసిరి పొడిని కలిపి, వేడి చేసి.. చల్లబరిచి, జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు సమస్యలను కూడా రాకుండా నిరోధిస్తుంది. తరచుగా దీనిని వాడటం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గి బాగా పెరుగుతుంది.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
మెంతి గింజల ప్యాక్:
రాత్రంతా నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మెంతులు జుట్టును బలపరుస్తాయి. వీటిలోని లక్షణాలు జుట్టు మృదువుగా మారేలా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. తరచుగా మెంతులతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడటం వల్ల కూడా అద్భతమైన ఫలితాలు ఉంటాయి. తెల్ల జుట్టు నల్లగా మారడంలో కూడా మెంతి గింజలు ఉపయోగపడతాయి.
అలోవెరా జెల్‌తో సహజ కండిషనింగ్:
అలబంద జుట్టును తేమగా ఉంచి.. తలపై చికాకును తగ్గిస్తుంది. అంతే కాకుండా తాజా కలబంద జెల్‌ను తలపై రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. దీనివల్ల జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరగడంలో కలబంద ఉపయోగపడుతుంది.