BigTV English

Indian Air Force AFCAT Notification: 304 పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ‘AFCAT’ నోటిఫికేషన్ రిలీజ్.. విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు

Indian Air Force AFCAT Notification: 304 పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ‘AFCAT’ నోటిఫికేషన్ రిలీజ్.. విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు

Indian Air Force AFCAT Notification 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Indian Air Forceలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) ప్రకటన తాజాగా రిలీజ్ అయింది. టెక్నిక‌ల్‌ అండ్ నాన్ టెక్నిక‌ల్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 304 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


AFCAT – 02/2024 విభాగాల వారీగా ఖాళీలు

ఫ్లయింగ్ బ్రాంచ్‌


ఫ్లయింగ్ బ్రాంచ్‌లో మొత్తం 29 ఖాళీలు ఉన్నాయి. అందులో మెన్-18, ఉమెన్-11 పోస్టులు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. (లేదా) 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ అర్హత అయినా కలిగి ఉండాలి. దీంతోపాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక డీజీసీఏ ద్వారా కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్న వారికి 2ఏళ్ల వరకు వయోసడలింపు కల్పించారు.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) విభాగంలో మొత్తం 156 ఖాళీలున్నాయి. అందులో మెన్-124, ఉమెన్-32 పోస్టులున్నాయి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌(ఎల‌క్ట్రానిక్స్‌/మెకానిక‌ల్) విభాగాల్లో లేదా అనుంబంధ బ్రాంచీల్లో బీటెక్‌/ బీఈ అర్హత ఉండాలి. ఇంట‌ర్‌‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ను కలిగి ఉండాలి. అంతేకాకుండా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

Also Read: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)

గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)లో మొత్తం 119 పోస్టులు ఉన్నాయి. అందులో మెన్ 95, ఉమెన్ 24 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్, వెపన్ సిస్టమ్, ఎల్‌జీఎస్‌, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, మెటియోరాలజీ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇందులో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ స‌బ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏదైనా డిగ్రీ లేదా బీఈ/ బీటెక్ లేదా బీకాం/బీఎస్సీ/ బీబీఏ/ సీఏ/సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

NCC స్పెషల్ ఎంట్రీ

సీడీఎస్ ఎగ్జామ్స్ నుంచి 10శాతం.. అలాగే ఏఎఫ్‌క్యాట్ 2/2024 నుంచి 10 శాతం ఖాళీలను ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద భర్తీ చేయనున్నారు. NCC స్పెషల్ ఎంట్రీకి CDS (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్) ఎగ్జామ్ ద్వారా 10శాతం సీట్లను, AFCAT-2023 ఎగ్జామ్ ద్వారా 10శాతం సీట్లను కేటయిస్తారు.

Also Read: BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌‌లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియ మే 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags

Related News

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

BSF Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు భయ్యా

LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

Big Stories

×