BigTV English

Sonia Gandhi Message to Delhi Voters: ఢిల్లీ ప్రజలకు సోనియా పిలుపు.. వాటిపై మా పోరాటం అంటూ మెసేజ్..

Sonia Gandhi Message to Delhi Voters: ఢిల్లీ ప్రజలకు సోనియా పిలుపు.. వాటిపై మా పోరాటం అంటూ మెసేజ్..

Sonia Gandhi Message to Delhi Voters During the Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 58 సీట్లకు ఆరో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఆరు రాష్ట్రాలతోపాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోన న్నది ఆసక్తి రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఢిల్లీలో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బీజేపీ పోటీ చేస్తుండగా, కూటమి తరపున ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు చోట్ల బరిలోకి దిగాయి.


గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులను ఈసారి బీజేపీ మార్చేసింది. కాకపోతే ఢిల్లీ ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటుంది. 2019లో బీజేపీకి విజయాన్ని కూడబెట్టిన హస్తిన ఓటర్లు, మరుసటి ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ వైపు మొగ్గు చూపారు. ఈసారి అక్కడ ఎన్నికల ఉత్కంఠబరితంగా సాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, బెయిల్‌పై ఆయన రావడం ఒక ఎత్తయితే, ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఒకరు ఎంపీ స్వాతిమాలీవాల్‌పై దాడి చేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో చూడాలి.

ఇదిలావుండగా ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడిన వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ప్రజాస్వామం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎన్నికలు చాలా ముఖ్యమైవని గుర్తు చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి సమస్యలు తారాస్థాయికి చేరాయని వివరించారు. ఈ పోరాటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని  విజ్ఞప్తి చేశారు.


Also Read: Blast in Gunpowder Factory : ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి

ఢిల్లీతోపాటు  యూపీలోని-14, హర్యానా- 10, బీహార్-8, బెంగాల్-8, ఒడిషా-6, జార్ఖండ్- 4, జమ్మూకాశ్మీర్ ఒక్క స్థానానికి శనివారం ఉదయం పోలింగ్ మొదలుకానుంది. ఇప్పటివరకు ఐదు విడతల్లో 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తి అయ్యింది. రేపటితో ఆ సంఖ్య 486కు చేరుకోనుంది.

Tags

Related News

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Save Delhi Dogs: ఈ ఆపరేషన్ చేస్తే వీధికుక్కల బెడద ఉండదు.. సేవ్ ఢిల్లీ డాగ్స్ పేరుతో పెట్ లవర్స్ ర్యాలీ

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

India’s Iron Dome: శత్రువుల గుండెలు అదిరేలా.. భారత్ గేమ్ ఛేంజర్.. మిషన్ సుదర్శన చక్ర ఎలా పని చేస్తుందంటే?

Governor Ganesan: నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఇక లేరు

Artificial Rain: డ్రోన్లతో వర్షమంటూ ప్రయోగం.. ఎగిరాయి కానీ, అంతా శూన్యం.. ఎక్కడంటే?

Big Stories

×