Big Stories

Japan:ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్..నయా ట్రెండ్ ఫాలో అవుతున్న యువత

Friendship Marriage: జపాన్ లో కొత్త రిలేషన్ షిప్ పాపులర్ అవుతోంది. జపాన్ యువత వివాహ బంధంలో కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెళ్లి కల తీరేందుకు ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. జపాన్ యువతలో 75 శాతం మంది వివాహమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి.

- Advertisement -

జపాన్ యువత కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఫ్రెండ్ షిమ్ మ్యారేజ్ లు చేసుకునేందుకు యువత ముందుకు వస్తున్నారు. అయితే ఈ రిలేషన్ షిప్ లో ప్రేమ, శృంగారానికి అవకాశం లేదు. జపాన్ లో చాలా మంది యువత ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. జపాన్ లో ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల కారణంగా యువత జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది.

- Advertisement -

పరస్పర ఆసక్తులు, విలువల ఆధారంగా కలిసి జీవించడమే ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్. వీళ్లు చట్టపరంగా దంపతులే అయినప్పటికీ..ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటారు. ఒక వేళ పిల్లలు కావాలని అనుకుంటే కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా ప్రయత్నిస్తారు. సాంప్రదాయ వివాహాలపై ఆసక్తి లేని వారు  ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ వైపు అడుగులు వేస్తున్నారని కొలొరస్ అనే జపాన్ సంస్థ తెలిపింది.

2015 నుంచి 500 మంది ఫ్రెండ్ షిమ్ మ్యారేజ్ లతో ఒక్కటయ్యారని సంస్థ వెల్లడించింది. వారిలో కొందరు పిల్లలను కూడా పెంచుకుంటున్నారని తెలిపింది.12 కోట్లకు పైగా ఉన్న దేశ జనాభాలో సుమారు 1 శాతం అంటే 12 లక్షల మంది ఇటువంటి తరహా వివాహాలపై ఆసక్తి చూపించారని తెలిపారు.

Also Read: అమెరికాలో మిస్సవుతున్న భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్!

పెళ్లికి ముందే ఈ రిలేషన్ లో ఉన్న వారు ఒకరిపై ఒకరు పరిచయం పెంచుకుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెసుకుంటారు. వారిద్దరికి సంబంధించిన ఖర్చులపై ఒక అభిప్రాయానికి వస్తారు. సాంప్రదాయ వైవాహిక బంధం, ప్రేమపై ఆసక్తి చూపని వారు ఇలాంటి రిలేషన్ షిప్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి జంటలు 80 శాతం మంది సంతోషంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఎక్కువగా 32 ఏళ్ల వయసు ఉన్న వారు ఇలాంటి రిలేషన్  కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News