E-Paper
Advertisement

Indian Navy: ఇండియన్ నేవీలో జాబ్స్.. వేతనం అక్షరాల రూ.1,25,000.. ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో

Indian Navy: ఇండియన్ నేవీలో జాబ్స్.. వేతనం అక్షరాల రూ.1,25,000.. ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ సెట్ బ్రో
Advertisement

ప్రస్తుతం దేశంలో పీడుస్తున్న సమస్య నిరుద్యోగం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రేపేర్ అయ్యే వారి సంఖ్య దేశంలో కోట్లల్లో ఉంటుంది. అయితే దేశసేవలో భాగస్వాములు కావాలనుకునే యువతీ యువకులకు భారత నౌకాదళం (Indian Navy) అద్భుత అవకాశాన్ని కల్పించింది.

కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ (INA)లో 2027 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Advertisement

ఉద్యోగ ఖాళీల వివరాలు.. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌ (జీఎస్‌-ఎక్స్‌/ హైడ్రో కేడర్‌)లో 76, పైలట్ విభాగంలో 25, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ (అబ్జర్వర్స్‌)లో 20, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగంలో 18 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు లాజిస్టిక్స్ (10), ఎడ్యుకేషన్‌ (07), ఇంజినీరింగ్ బ్రాంచ్ (42), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (38) వంటి కీలక విభాగాలలో కూడా ఖాళీలు ఉన్నాయి. సబ్‌మెరైన్ టెక్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల్లో తలో 8 పోస్టులను కేటాయించారు.

Advertisement

విద్యార్హతలు, వేతన వివరాలు.. 

అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాార్హతలతో పాటు నౌకాదళం నిర్దేశించిన శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.

వేతనం.. 

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలోనే ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది. ప్రారంభ వేతనం నెలకు సుమారు రూ. 1,25,000 వరకు ఉంటుందని నోటిఫికేషన్ పేర్కొంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబరిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన వారికి కేరళలోని ఎజిమల నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ ఉంటుంది.

దరఖాస్తు విధాన వివరాలివే.. 

అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 24

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/

ALSO READ: Nothing Phone Discount: 50MP కెమెరా, 5000mAhగల నథింగ్ కొత్త ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్‌లో భారీ ఆఫర్..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×