E-Paper
Advertisement

Ananthapuram: చొక్కా విప్పి నడిరోడ్డుపై యువకుల ట్రిపుల్ బైక్ రైడింగ్.. వీడియో వైరల్

Ananthapuram: చొక్కా విప్పి నడిరోడ్డుపై యువకుల ట్రిపుల్ బైక్ రైడింగ్.. వీడియో వైరల్
Advertisement

Ananthapuram: అనంతపురం జాతీయ రహదారిపై కొందరు యువకులు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా హల్ చల్ చేశారు . ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ఎక్కి, చొక్కాలు విప్పి అర్థనగ్నంగా ప్రయాణిస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. అతివేగంతో బైక్‌ను నడపడమే కాకుండా, రహదారిపై వెళ్తున్న ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా విన్యాసాలు చేస్తూ హల్‌చల్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అదే రోడ్డు పై వెళ్తున్న వాహనదారులు వారిని మందలించే ప్రయత్నం చేశారు.. దీంతో ఆ యువకులు అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. “పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు, మాకు ఎవరూ అడ్డు చెప్పలేరు” అంటూ అహంకారంతో మాట్లాడారు. మైనర్లు కావడంతో చట్టం తమను ఏమీ చేయదనే ధీమా వారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో సదరు బైక్ నంబర్‌ను గుర్తించి, ఆ ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు మైనర్లుగా తేలడంతో, ఆ వాహనం ఎవరి పేరు మీద ఉందో వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అశ్లీల ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

Also Read: ఆవు బీభత్సం.. వెంటాడి మరీ బాలికపై, సీసీటీవీ ఫుటేజ్

Advertisement

ప్రస్తుతం పోలీసులు ఆ యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి, భారీ జరిమానా విధించారు. రోడ్డు భద్రత నియమాలను అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ప్రమాదాలు జరిగితే యజమానులదే బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×