E-Paper
Advertisement

IPPB Recruitment 2025: రాతపరీక్ష లేకుండా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో 309 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇదే

IPPB Recruitment 2025: రాతపరీక్ష లేకుండా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో 309 పోస్టులు.. దరఖాస్తు విధానం ఇదే
Advertisement

IPPB Recruitment 2025: పోస్టల్ శాఖలో 309 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా 309 ఖాళీల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఐపీపీబీ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ పదవులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

నవంబర్ 11 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 1, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల, అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఐపీపీబీ అధికారిక వెబ్‌సైట్ ippbonline.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అసిస్టెంట్ మేనేజర్ (జేఏ స్కేల్-I): 110 పోస్టులు
  • జూనియర్ అసోసియేట్ (ఆఫీస్ కేడర్): 199 పోస్టులు

అర్హత ప్రమాణాలు

Advertisement

అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ పోస్టులకు ప్రాథమిక విద్యార్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి (నవంబర్ 01, 2025 నాటికి)

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థుల వయసు 20-35 సంవత్సరాల మధ్య ఉండాలి. జూనియర్ అసోసియేట్ పోస్టులకు వయస్సు 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు (SC/ST/OBC/PwD) వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

Advertisement

దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి రూ. 750 ఫీజును చెల్లించాలి.

దరఖాస్తు విధానం

1. ippbonline.com లోని ఐపీపీబీ కెరీర్స్ పోర్టల్‌ పై క్లిక్ చేయండి.
2. హోమ్‌పేజీలో అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ 2025 లింక్‌ పై క్లిక్ చేయండి.
3. ప్రాథమిక వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
4. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అయి ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేయాలి..
5. ఆన్‌లైన్ మోడ్‌ ద్వారా రూ. 750 దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
6. దరఖాస్తు రుసుము చెల్లింపు తర్వాత, ఫామ్‌ను సబ్మిట్ చేయండి. దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఎంపిక విధానం

ఈ పోస్టులను పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే, అసెస్‌మెంట్/ఆన్‌లైన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ నిర్వహించే హక్కు బ్యాంకుకు ఉంది. మెరిట్ జాబితాలో ఇద్దరు అభ్యర్థులు సమాన మార్కులు పొందినట్లయితే అభ్యర్థి పుట్టిన తేదీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read: ONGC: గుడ్ న్యూస్.. 2623 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. అప్లై చేస్తే రూ.12,300 స్టైఫండ్

డిప్యుటేషన్ పదవీకాలం ఒక సంవత్సరం ఉంటుంది. దీనిని 2 సంవత్సరాలకు పొడిగించే హక్కు బ్యాంకుకు ఉంది. అయితే వీరు ఐపీపీబీలో రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకునేందుకు అర్హులు కాదు. అభ్యర్థుల పనితీరును ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. వరుసగా రెండు సమీక్షలలో పనితీరు సంతృప్తికరంగా లేదని తేలితే ఒక నెల నోటీసు ఇచ్చి స్వదేశానికి పంపవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×