E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 65 : పక్కకెళ్లి ఆడుకోపో తనూజా… ఇచ్చిపడేసిన కళ్యాణ్… రీతూ ఫౌల్ గేమ్ పై సంజన రచ్చ రంబోలా

Bigg Boss 9 Telugu Day 65 : పక్కకెళ్లి ఆడుకోపో తనూజా… ఇచ్చిపడేసిన కళ్యాణ్… రీతూ ఫౌల్ గేమ్ పై సంజన రచ్చ రంబోలా
Advertisement

Bigg Boss 9 Telugu Day 65 : బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం హౌస్ మొత్తం నామినేషన్లలోనే ఉంది. ఒక్క ఇమ్మూ తప్ప. ఈ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ లోకి అడుగు పెట్టడానికి కంటెస్టెంట్స్ కొన్ని గేమ్స్ ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించారు. ఆ టాస్క్ లకు సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు ప్రసారమైంది. మరి ఈరోజు కంటెస్టెంట్స్ ఆడిన టాస్కులు ఏంటి? అసలేం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే…

కింగ్, క్వీన్ టాస్క్

ప్రస్తుతం హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కళ్యాణ్ కింగ్, దివ్య, రీతులను క్వీన్స్ గా చేశారు బిగ్ బాస్. మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ మామూలు జనాలు. అయితే సాధారణ ప్రజలుగా ఉన్నవాళ్ళలో నలుగురిని రాజు, రాణులు కంటెండర్స్ ను చేయాల్సి ఉంటుంది. తరువాత మిగిలిపోయిన వారు సామాన్య జనాలుగా ఉంటారు. దీనికోసం రాజు, రాణులు ఒక్కొక్కరిగా హౌస్ మేట్స్ ను ఇంటర్వ్యూ చేసి… డెమోన్, తనూజా, సంజన, నిఖిల్ లను కమాండర్లుగా ప్రకటించారు. తనూజా-సంజనాకు ఫుడ్, డెమోన్ కు ఇన్ఫర్మేషన్, నిఖిల్ కు సెక్యూరిటీ బాధ్యతలు ఇచ్చారు కింగ్.

Advertisement

కమాండర్లకు బుట్టలో బాల్ వేసే టాస్క్ పెట్టారు. ఇందులో నలుగురు కమాండర్లు బుట్టలు వేసుకుని, తమ బుట్టలో అవతలి వారు వేసే బాల్ పడకుండా చూసుకోవాలి అన్నది టాస్క్. ఈ టాస్క్ లో ఓడిపోయిన కమాండర్ సామాన్యులలో ఒకరితో పోటీ పడి మరో టాస్క్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో కూడా ఓడిపోతే కమాండర్ పదవి పోతుంది. గెలిచిన వారు కొత్త కమాండర్ అవుతారు అన్నది బిగ్ బాస్ కండిషన్. ఇక భరణిని ఈ టాస్క్ లో ఓ ఆట ఆడుకుంది దివ్య. హెడ్ మసాజ్ పేరుతో భరణితో పనిష్మెంట్ రేంజ్ లో పని చేయించుకుంది.

రీతూ వర్సెస్ సంజన

‘విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్’ టాస్క్ లో రీతూ సంచాలక్ గా ఉంది. నిఖిల్, డెమోన్ గీతదాటి బయటకు వెళ్ళి రెండుసార్లు రూల్స్ బ్రేక్ చేశారు. అయితే ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వదిలేసింది రీతూ. అంతకంటే ముందు నిఖిల్ ను ఆడొద్దు అని రీతూ చెప్పింది. కానీ తనూజా ఎందుకు? డెమోన్ కూడా అదే చేశాడు కదా ? అని అడగడంతో మళ్ళీ నిర్ణయం మార్చుకుని నిఖిల్ ను ఆడనిచ్చింది. దీంతో అతన్ని రిమూవ్ చెయ్యి. ఫౌల్ గేమ్ ఆడుతున్నావ్ అని సంజన మండిపడింది. నేను ఇక్కడ సంచాలక్. కావాలని పోర్ట్రే చెయ్యకండి అంటూ ఫైర్ అయ్యింది రీతూ. ఈ టాస్క్ 3 రౌండ్స్ లో జరగ్గా… చివరికి సంజన ఓటమి పాలయ్యింది.

తనూజా వర్సెస్ కళ్యాణ్

Advertisement

ఓడిపోయిన కమాండర్ కు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ‘బిల్డ్ ఇట్ టు విన్ ఇట్’ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో స్క్వేర్ బాక్స్ లను ఒకదానిపై ఒకటి టవర్ గా పేర్చాల్సి ఉండగా, సుమన్- సంజన పాల్గొన్నారు. సుమన్ శెట్టితో పోలిస్తే సంజన టవర్ పర్ఫెక్ట్ గా ఉండడంతో సంచాలక్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని చెప్పాడు. కానీ తనూజా మధ్యలో వచ్చి ఆయన హైట్ లేకపోయినా పెట్టాడు. ముందే చెప్పాలి కదా పర్ఫెక్ట్ గా ఉండాలని అంటూ వాదన మొదలెట్టింది. ‘ఇదే వద్దు, తప్పుగా పోట్రెయిట్ చేస్తే ఎవ్వడూ పడడిక్కడ’ అంటూ కళ్యాణ్ కూల్ గా ఇచ్చిపడేశాడు. దీంతో తనూజా ‘ఫెయిల్డ్ సంచాలక్’ అంటూ కోపంగా వెళ్ళిపోయింది.

Read Also : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×