Job Alert: కడప జిల్లా నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఏ, బీఎస్సీ, పదో తరగతి, డీఎంఎల్‌టీ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం కూడా కల్పిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
కడప జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(DSH-KADAPA ) కాట్రాక ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బయో స్టాటిస్టీసియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, జీడీఏ, ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
బయో స్టాటిస్టీసియన్: 01
రేడియోగ్రాఫర్: 01
ల్యాబ్ టెక్నీషియన్: 02
ల్యాబ్ అటెండెంట్: 02
జీడీఏ/ఎన్‌వో/ఎఫ్ఎన్‌వో: 03
దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 8
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 16
విద్యార్హత:
ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఏ, బీఎస్సీ, పదోతరగతి, డీఎంఎల్‌టీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు:
42 ఏళ్ల నిండి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం:
నెలకు బయో స్టాటిస్టిషీయన్ పోస్టుకు రూ.18,500, రేడియోగ్రాఫర్ పోస్టుకు రూ.35,570, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు రూ.32,670, మిగతా పోస్టులకు రూ.15,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది.
చిరునామా:
ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ కో-ఆర్డీనేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్, డీఎస్‌హెచ్, కడప, ఓ బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప, వైఎస్‌ఆర్ జిల్లా.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి. ఆల్ ద బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 16