Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ అనేవి గర్భిణీలు ఎదర్కునే సాధారణ సమస్య అని చెప్పవచ్చు. గర్భదారణ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల పొట్టపై సాగిన గుర్తులు కూడా కనిపిస్తాయి. వీటి కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోవలసి వస్తుంది. అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి మార్కెట్‌లో అనేక రకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అందరికీ ఒకేలాగా పనిచేయవు. అందుకే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ వాడటం మంచిది. వీటితో సాగిన చర్మం గుర్తును మనం ఈజీగా తగ్గించవచ్చు. మరి ఎలాంటి హోం రెమెడీస్ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా జెల్:
మీ శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ తగ్గాలంటే.. మీరు ప్రభావిత ప్రాంతంపై క్రమం తప్పకుండా అలోవెరా జెల్ అప్లై చేయండి. దీని కోసం మీరు ప్రతి రోజు రాత్రి పూట కలబంద జెల్ వాడండి. అరగంట తర్వాత దీనిని మీరు శుభ్రం చేసుకోవచ్చు. లేదా రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. కలబంద వాడటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తక్కువ సమయంలోనే ఈజీగా తగ్గుతాయి. అంతే కాకుండా స్కిన్ కూడా మృదువుగా మారుతుంది.
తేనె:
తేనెలో ఉండే లక్షణాలు స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. స్ట్రెచ్ మార్క్స్ పై తేనె అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. అరగంట తర్వాత వాష్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు కొన్ని రోజుల్లోనే స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవచ్చు.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె ప్రతి ఇంట్లో ఉంటుంది. చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. మీరు దీనిని మీ చర్మంపై సాగిన గుర్తులు ఉన్న చోట పూయవచ్చు. దీని కోసం.. మీరు ప్రతిరోజూ కాస్త కొబ్బరి నూనె తీసుకుని స్ట్రెచ్ మార్క్స్ పై మసాజ్ చేయండి. మీరు దీన్ని రాత్రిపూట కూడా అప్లై చేసి నిద్రపోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ ఇ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
నిమ్మరసం:
నిమ్మరసంలో ఉండే మూలకాల వల్ల చర్మంపై ఉండే స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాబట్టి మీరు కూడా దీన్ని తరచుగా ఉపయోగించవచ్చు.
Also Read: చిటికెడు కాఫీ పొడితో.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !
చక్కెర, నూనె:
బాదం నూనె, నిమ్మరసంలో చక్కెర కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేయండి. ఈ మిశ్రమంతో.. కొన్ని రోజుల్లో సాగిన గుర్తులు పూర్తిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. స్కిన్ పై నిమ్మరసం ఉపయోగించే ముందు.. ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. తద్వారా ఎలాంటి అలెర్జీ వచ్చే అవకాశం ఉండదు. స్ట్రెచ్ మార్క్స్ తొలగించడానికి నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది శాశ్వత పరిష్కారంగా పనిచేస్తుంది. అంతే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.