Lady Aghori – SriVarshini : లేడీ అఘోరీ లవ్స్ శ్రీవర్షిణి. ఇప్పుడీ టైటిల్ కాస్త మార్చాలి. అఘోరీ వెడ్స్ వర్షిణి. అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇది బిగ్ టీవీ వేదికగా శ్రీ వర్షిణి చెప్పిన నిజం. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన స్టోరీ. ఒకరికి ఒకరం.. నువ్వు లేక నేను లేను.. అనే రేంజ్‌లో సినిమా స్టైల్‌లో సాగింది వారి లవ్ ఎపిసోడ్. అది కాస్తా ఇప్పుడు మ్యారేజ్ టర్న్ తీసుకుంది. ఇటీవల ఇంట్లో నుంచి పారిపోయారు శ్రీవర్షిణి. అఘోరీతో కలిసి గుజరాత్ వెళ్లిపోయారు. వర్షిణి పేరెంట్స్ పోలీసుల సాయంతో కూతురిని పట్టుకున్నారు. అఘోరీ నుంచి బలవంతంగా తీసుకొచ్చేశారు. ఇక కథ సుఖాంతం అనుకున్నారు అంతా. కానీ, ఇంకా ఉంది.. అంటూ పార్ట్ 2 మొదలైంది. శ్రీవర్షిణి ప్రస్తుతం పేరెంట్స్‌తో లేదు. అలాగని అఘోరీతోనూ లేదు. తమ స్టోరీలో విష్ణునే విలన్ అని చెబుతోంది వర్షిణి. బిగ్ టీవీ స్టూడియోలో మొత్తం మేటర్ చెప్పేసింది.
తాళి కట్టిన శుభవేళ..
లేడీ అఘోరీతో తనకు పెళ్లి అయిందని శ్రీ వర్షిణి చెబుతోంది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అఘోరీ తనకు తాళి కట్టిందని తెలిపింది. ఇంటికొచ్చాక మళ్లీ తన పేరెంట్స్, విష్ణు ముందు మరోసారి తాళి కట్టిందని అన్నారు. తమ పెళ్లి మేటర్ ఇంట్లో అందరికీ తెలుసని తేల్చి చెబుతోంది వర్షిణి.
అఘోరీ మా కోడలు పిల్లా..
గుడిలో తన పెళ్లి అయ్యాక అఘోరీ కొన్నాళ్లు చెన్నై వెళ్లిపోయిందని.. వారం తర్వాత మళ్లీ తిరిగొచ్చిందని చెప్పారు. చెన్నై నుంచి తనకోసం గోల్డ్ చైన్, బంగారు మంగళసూత్రాలు తీసుకొచ్చిందని అన్నారు. మరోసారి తన తల్లిదండ్రుల ముందే అఘోరీ తన మెడలో బంగారు తాళి కట్టారని తెలిపారు. తన పేరెంట్స్ సైతం అఘోరీని కొడలు పిల్లా అంటూ పిలుచుకున్నారని.. తామంతా చక్కగా ఓ ఫ్యామిలీగా కలిసిపోయామని శ్రీ వర్షిణి చెప్పారు. అఘోరీ ఎప్పుడు ఫోన్ చేసినా.. కోడలు పిల్లా కోడలు పిల్లా అంటూ మా అమ్మ అఘోరీతో మంచిగా మాట్లాడేవారని తెలిపారు. అయితే, తామంతా ఇలా కలిసిపోవడం విష్ణుకు నచ్చలేదని.. అంతా అతని వల్లే అని చెప్పుకొచ్చారు. అఘోరీ మీద లేనిపోనివి బ్యాడ్‌గా చెప్పి.. విష్ణు తన పేరెంట్స్‌ను రెచ్చగొట్టాడని శ్రీ వర్షిణి చెబుతోంది.
అఘోరీతో సహజీవనం చేస్తా..
తాను ఇష్ట పూర్వకంగానే అఘోరీని పెళ్లి చేసుకున్నానని వర్షిణి బిగ్ టీవీతో చెప్పింది. అమ్మాయా? అబ్బాయా? అని తాను చూడలేదని.. లేడీ అఘోరీ జెన్యూనిటీ చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అంటోంది. తనకు సెక్స్ అంత ఇంపార్టెంట్ కాదని.. కావాలంటే అనాథ పిల్లలను పెంచుకుంటామని స్పష్టం చేస్తోంది. జీవితాంతం తనకు తోడు ఉంటుందనే నమ్మకంతోనే అఘోరీని పెళ్లి చేసుకున్నాననేది వర్షిణి వెర్షన్. తాను మేజర్‌నని.. ఎవరితోనైనా ఉండే హక్కు తనకు ఉందని వాదిస్తోంది. అఘోరీతోనే లైఫ్ లాంగ్ సహజీవనం చేస్తానని తేల్చి చెబుతోంది వర్షిణి.
విష్ణునే విలన్
మొదట్లో పేరెంట్స్‌కు కూడా తమ పెళ్లి ఇష్టమేనని.. మధ్యలో విష్ణు వచ్చి తన తల్లిదండ్రుల బ్రెయిన్ వాష్ చేశాడనేది వర్షిణి వాదన. ఆ తర్వాత పేరెంట్స్ తీరు మారిపోయిందని.. అబ్బాయితో లేచిపోయినా ఏమీ అనుకునే వాళ్లం కాదు.. ఇలా అటూఇటూ కాని వాడితో ఎలా పోతావ్ అని ఇప్పుడు తన తల్లిదండ్రులు తనను నిలదీస్తున్నారని వర్షిణి చెబుతోంది. అయితే, మీ ముందు తాళి కట్టినప్పుడు మీరేం అభ్యంతరం చెప్పలేదుగా? కోడలు పిల్లా అంటూ అఘోరీని కుటుంబంలో కలిపేసుకున్నారుగా? మరి, ఇప్పుడెందుకు తమని దూరం చేస్తున్నారని వర్షిణి ప్రశ్నిస్తోంది. ఇదంతా విష్ణు వల్లనేనని మండిపడుతోంది. గతంలో తనను దారుణంగా కొట్టాడని.. పీరియడ్స్ టైమ్‌లో కూడా కాలితో తన కడుపులో తన్నాడని.. విష్ణుతో తనకు బాగా గొడవైందని చెబుతోంది శ్రీవర్షిణి.