Ghee Coffee: ఫిట్‌నెస్ ప్రపంచంలో ప్రతిరోజూ కొత్త పోకడలు, సంస్కృతులు ఉద్భవిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒక కొత్త ట్రెండ్ ‘నెయ్యి కాఫీ’. బాలీవుడ్ తారలు రకుల్ ప్రీత్ సింగ్, శిల్పా శెట్టి, కృతి సనన్ సహా చాలా మంది యాక్టర్స్ నెయ్యి కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారని చాలా సార్లు మీడియా ముందు చెప్పారు. నెయ్యి, కాఫీ తమ ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాలా మంది నమ్ముతారు . ఇంతకీ నెయ్యి కాఫీ అంటే ఏమిటి ? సెలబ్రిటీలు తాగే ఈ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి కాఫీ అంటే ఏమిటి ?
నెయ్యి కాఫీని బటర్ కాఫీ, బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఒక టీస్పూన్ దేశీ నెయ్యిని బ్లాక్ లేదా ఎస్ప్రెస్సో కాఫీకి కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మీకు శక్తిని అందిస్తుంది. దేశీ నెయ్యిలో కాల్షియం, విటమిన్ ఎ-డి-కె, ఐరన్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ నెయ్యి, కాఫీల కలయిక అద్భుతంగా ఉంటుంది. ఇది అనేక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
రోజంతా ఉత్సాహం:
మీరు మీ రోజును ఫున్ ఎనర్జీతో ప్రారంభించాలనుకుంటే.. దేశీ నెయ్యి కలిపిన కాఫీ మీకు మంచి ఎంపిక అవుతుంది. ఇది మీకు వెంటనే శక్తినిస్తుంది. నిజానికి.. మీరు ఆరోగ్యకరమైన కొవ్వుతో కలిపిన కెఫిన్ తాగినప్పుడు.. కెఫిన్ శోషణ నెమ్మదిస్తుంది. ఇది మీకు రోజంతా శక్తిని అందిస్తుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:
కొంతమంది అసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఖాళీ కడుపుతో నెయ్యి కలిపిన కాఫీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడమే కాకుండా, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీ ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాలు బాగా గ్రహించబడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు:
శరీరం సజావుగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. ఇందుకు నెయ్యి కాఫీ మంచి ఎంపిక . ఈ కాఫీలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దేశీ నెయ్యిలో అనేక ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
దృష్టిని పెంచడం:
నేటి బిజీ జీవితంలో.. చాలా మంది అనేక ఉద్రిక్తతలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. నెయ్యి కాఫీ మీ శారీరక , మానసిక ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల మీ మనసు తాజాగా ఉంటుంది. అంతే కాకుండా మీ ఒత్తిడి తొలగిపోతుంది. ఫలితంగా మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు.
Also Read: పుచ్చకాయపై ఉప్పు చల్లుకుని తినాలా ? వద్దా ?
రక్తంలో చక్కెర స్థాయి:
భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నిశ్శబ్ద కిల్లర్ ని నివారించడంలో నెయ్యి కాఫీ సహాయపడుతుంది. దేశీ నెయ్యి మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. బుల్లెట్ కాఫీ కూడా స్వీట్ల తినాలన్న మీ కోరికను తగ్గిస్తుంది. అంతే కాకుండా మధుమేహంతో బాధపడేవారికి ఇది రెట్టింపు ప్రయోజనకరంగా ఉంటుంది.