OFMK Recruitment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పవచ్చు. ఆర్టినెనస్ ఫ్యాక్టరీ మెదక్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 4 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ (మెకానిక్), డిజైన్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), డిజైన్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
అనాలిసిస్ ఇంజినీర్: 01
డిజైన్ ఇంజినీర్(మెకానికల్): 04
డిజైన్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 01
డిజైన్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్): 01
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 4 (ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.)
వయస్సు: 2025 మార్చి 15 నాటికి 30 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు అనాలిసిస్ ఇంజినీర్‌కు రూ.60,000, డిజైన్ ఇంజినీర్‌కు రూ.50,000, డిజైన్ అసిస్టెంట్‌కు రూ.40,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్/హెచ్ ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ-502205 చిరునామాకు పంపాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://avnl.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య: 7
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 4
ALSO READ: BOI Recruitment: మంచి అవకాశం.. డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు