Robinhood Trailer Review: కామెడీ సినిమాలకు తెలుగులోనే కాదు.. ప్రతీ భాషలో మంచి క్రేజ్ ఉంటుంది. చాలామంది ప్రేక్షకులు కామెడీ సినిమాలను క్రింజ్ అంటున్నా సరే.. అవి ఒక రేంజ్‌లో హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. ఇప్పుడు అదే జోనర్‌లో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తుంటే ఇదొక పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. అందుకే మూవీ టీమ్ కూడా ‘రాబిన్‌హుడ్’ సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు మేకర్స్. ఇది చూస్తుంటే ఇప్పటికే చాలాసార్లు చూసిన కథలాగా అనిపిస్తుందే అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
ఏజెంట్ రాబిన్‌హుడ్
‘‘నా పేరు రామ్. ఏజెంట్‌కు తగినట్టు రాబిన్‌హుడ్ అని మార్చేసుకుంటా’’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ‘రాబిన్‌హుడ్’ (Robinhood) ట్రైలర్ విడుదల అవుతుంది. ఒక సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు పనికోసం వెళ్లిన నితిన్.. అంతకు ముందు రాత్రుళ్లు లేట్‌గా నిద్రపోయేవాడిని అని చెప్తాడు. తను లేట్‌గా నిద్రపోవడానికి తను చేసే దొంగతనాలే కారణం అని అప్పుడే ప్రేక్షకులకు రివీల్ చేసేశారు మేకర్స్. ఆ తర్వాత పోలీస్ పాత్రలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పరిచయం అవుతాడు. ‘‘ఏబీ ఫార్మాసూటికల్స్ ఎమ్‌డీ మిస్ నీరా వాసుదేవ్ ఇండియాకు వస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి సర్వీస్ కావాలి’’ అంటూ వెన్నెల కిషోర్ డైలాగ్‌తో శ్రీలీల ఎంట్రీ ఇస్తుంది.
అలాంటి క్యారెక్టర్స్
శ్రీలీల (Sreeleela)కు సెక్యూరిటీ కావాలని రాజేంద్ర ప్రసాద్ ఏజెన్సీకి ఫోన్ చేస్తాడు వెన్నెల కిషోర్. కానీ అక్కడ 70+, 80+ సెక్యూరిటీ ఉంటారు. అది చూసి నితిన్ షాకవుతాడు. వారితో పాటు సెక్యూరిటీగా శ్రీలీల ఇంటికి వెళ్తాడు. ‘‘కొవ్వొత్తి వెలుగునిస్తుంది. కానీ అది వెలగాలంటే మీలాంటి ఫైర్ కావాలి’’ అంటూ డైలాగ్స్ చెప్పి హీరోయిన్‌ను ప్రేమలో పడేస్తాడు. శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ట్రైలర్‌తోనే స్పష్టం చేశారు మేకర్స్. దాంతో పాటు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ టైమింగ్ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఆపై విలన్ ఎంట్రీ, నితిన్ ఫైట్స్.. అన్నీ కామన్‌గానే ఉన్నాయి. ట్రైలర్ సెకండ్ హాఫ్ అంతా చాలా రొటీన్ అనే అనిపిస్తుంది.
Also Read: కొడుకు డెబ్యూ మూవీ ఫ్లాప్.. మంచి పనే జరిగిందంటూ అమీర్ షాకింగ్ కామెంట్స్
క్రింజ్ డైలాగ్స్
‘‘కరోనా వస్తే క్వారంటీన్ 14 రోజులే. నేను వస్తే జీవితాంతం’’ అనే డైలాగ్‌తో విలన్‌ను బెదిరిస్తాడు నితిన్ (Nithiin). ఇది మాత్రమే కాదు.. ఇలాంటి ఎన్నో డైలాగ్స్‌ను క్రింజ్‌లాగా ఫీలవుతున్నారు ప్రేక్షకులు. ఇందులో ఉన్న కామెడీ గానీ, యాక్షన్ గానీ, విలనిజం గానీ ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసినట్టే ఉంది కదా అని వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ట్రైలర్ అంతా అయిపోయే సమయానికి డేవిడ్ వార్నర్ ఎంట్రీ హైలెట్‌గా నిలుస్తుంది. లాలీపాప్ తింటూ గ్యాంగ్‌స్టర్ డ్రెస్‌లో హెలికాప్టర్ నుండి స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు వార్నర్. ఇక ఈ వార్నర్ ఎంట్రీ తప్పా మిగతా ట్రైలర్ అంతా చాలా రొటీన్‌గా, 80+ స్టోరీతో సాగిపోయిందని ప్రేక్షకుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి.