Nivetha Thomas:నివేదా థామస్(Nivetha Thomas).. ఈ పేరు చెబితే తెలియని సౌత్ సినీ ప్రేమికులు ఉండరు. జెంటిల్ మెన్ (Gentleman), నిన్ను కోరి(Ninnu Kori), వకీల్ సాబ్(Vakeel Saab),జై లవకుశ(Jai Lava Kusa), వి, బ్రోచేవారెవరురా, 118 వంటి హిట్ సినిమాల్లో నటించిన నివేదా థామస్ తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో పేరున్న హీరోయిన్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిన కొత్తలో తన లుక్స్ తో ఎంతో మంది యూత్ ని ఆకట్టుకున్న నివేదా థామస్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నివేదా థామస్ ని చూసిన చాలా మంది జనాలు ఇదేంటి ఈమె ఇలా మారిపోయింది అని షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే నివేదా థామస్ చాలా బరువు పెరిగిపోయి చబ్బీగా కనిపిస్తోంది.అయితే తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొన్న నివేదా థామస్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
గద్దర్ అవార్డ్స్ లో మెరిసిన నివేదా థామస్..
విషయంలోకి వెళ్తే.. తాజాగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్(Gaddar Awards) ప్రధానోత్సవం జరిగిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమక్షంలో ఈ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది.ఇందులో భాగంగా 2024 లో బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డు ని నివేదా థామస్ అందుకుంది. 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kadu)అనే సినిమాకి గానూ గద్దర్ బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డు అందుకుంది.అలా గద్దర్ అవార్డ్స్ వేడుకలో నివేదా థామస్ చీర కట్టుకొని తళుక్కుమంది. అయితే నివేదా థామస్ స్టేజ్ మీదకు అవార్డు తీసుకోవడానికి వెళ్ళిన సమయంలోని ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో నివేదా థామస్ చీరకట్టులో చాలా క్యూట్ గా కనిపించినప్పటికీ చాలా బరువు పెరగడంతో ఇదేంటి నివేదా థామస్ ఇలా మారిపోయింది.. అప్పుడున్న నివేదా థామస్ కి ఇప్పుడున్న నివేదా థామస్ కి అస్సలు పోలిక లేదు అంటూ సోషల్ మీడియా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Amalapaul: నగ్న సన్నివేశంపై.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్!
నివేదా థామస్ సినిమాలు..
ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక నివేదా థామస్ అంతలా బరువు పెరిగిపోవడానికి కారణం ఆమెకు ఏదో వ్యాధి ఉందని, ఈ వ్యాధి కారణంగానే నివేదా థామస్ అలా అమాంతం బరువు పెరిగిపోయింది అనే రూమర్లు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నివేదా థామస్ సినిమాల విషయానికొస్తే.. చివరిగా రెజీనా (Regina) తో కలిసి షాకిని డాకిని(Shakini Dakini),35 చిన్న కథ కాదు అనే సినిమాలలో నటించింది.
?utm_source=ig_web_copy_link