BigTV English

Railtel Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. భారీగా జీతం.. హైదరాబాద్‌లోనే జాబ్..

Railtel Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. భారీగా జీతం.. హైదరాబాద్‌లోనే జాబ్..

Railtel Jobs: బీఈ, బీటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(రైల్‌టెల్‌) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో సహా టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 12

ఇందులో అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్):9, డిప్యూటీ మేనేజర్(టెక్నికల్): 3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


విద్యార్హత: 

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్‌ నిర్వహణ తత్సమాన విభాగాల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి సంబంధిత విభాగాలలో బీఈ, బీటెక్, ఎంసీఏ ఆర్ తత్సమాన విద్యార్హత ఉంటే సరిపోతుంది.

వయస్సు: అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

జీతం: అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి రూ.30,000 నుంచి రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.40,000 నుంచి రూ.1,40,000  జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.   

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(100 మార్కులు), జనరల్‌ ఆప్టిట్యూడ్‌(50 మార్కులు)నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌

పనిచేయాల్సిన ప్రదేశాలు: హైదరాబాద్‌/సికింద్రాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2025.

వెబ్‌సైట్‌: https://www.railtel.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×