BigTV English

Vishal: నేను తిరిగి రాలేననుకున్నారా.. పూర్తిగా కోలుకొని అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన విశాల్

Vishal: నేను తిరిగి రాలేననుకున్నారా.. పూర్తిగా కోలుకొని అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన విశాల్

Vishal: కోలీవుడ్  స్టార్ హీరోల్లో విశాల్ ఒకడు. అవ్వడానికి  తెలుగువాడు అయినా చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడే తమిళ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కూడా విశాల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పందెం కోడి, పొగరు, భరణి, సెల్యూట్, వాడు వీడు, డిటెక్టీవ్ , ఎనిమీ, లాఠీ, మార్క్ ఆంటోని లాంటి సినిమాలతో తెలుగువారిని కూడా అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక తాజాగా విశాల్  అనారోగ్యానికి గురైన విషయం  తెల్సిందే.


విశాల్ నటించిన మదగజరాజాసినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన  ఒక ఈవెంట్ లో ఆయనను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అసలు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. జుట్టు మొత్తం పోయి, బక్కచిక్కి, మైక్ ను కూడా పట్టుకోలేక చేతులు వణుకుతూ.. ఎంతో  అనారోగ్యంతో ఉన్నట్లు  కనిపించాడు. దీంతో విశాల్ కు ఏమైంది అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే వెంటనే అపోలో వైద్యులు.. విశాల్ వైరల్ ఫీవర్  బారిన పడినట్లు చెప్పుకొచ్చారు. అయితే  తమిళ్ లోని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం విశాల్ గురించి చాలా తప్పుగా  చెప్పుకొచ్చాయి.

విశాల్ మద్యానికి బానిసయ్యాడని, అప్పుల బాధ చాలా ఎక్కువగా ఉండడంతో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నాడని కొందరు.. మద్యంతో పాటు డ్రగ్స్  కూడా వాడుతున్నాడని, ఆయనకు విజయ్ కాంత్ పరిస్థితే ఎదురవుతుందని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా మాట్లాడారు. అంతేకాకుండా  ఆయన ఇక తిరిగి రాలేడని కూడా చెప్పుకొచ్చారు. కానీ, విశాల్ సింహంలా తిరిగివచ్చాడు. మొన్న జయం రవి  చెప్పిన విధంగానే ఎంతో శక్తితో ఒక సింహం మాదిరి విశాల్ మదగజరాజా ప్రీమియర్ షోలో మెరిశాడు. పూర్తి ఆరోగ్యంగా విశాల్ నడుచుకుంటూ వచ్చాడు.


Game Changer: మూలిగే నక్కపై తాటికాయ పడడమంటే ఇదే.. గేమ్ ఛేంజర్ కు మరో బిగ్ షాక్

సినిమాను వీక్షిణించిన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ” నేను తిరిగి రాననుకున్నారా.. ? ఇప్పుడు నేను చాలా బావున్నాను. నా ఆరోగ్యం బావుంది. దీని నుండి నేను ఒక విషయం నేర్చుకున్నాను. చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను. వారి ప్రేమ వలనే నేను కోలుకున్నాను. ఆరోజు వైరల్ ఫీవర్ ఎక్కువైంది. మైక్ కూడా పట్టుకోలేకపోయాను.

నను ఇంట్లో అమ్మ నాన్న  వెళ్లోద్దని చెప్పారు. కానీ, సుందర్ కోసం వచ్చాను. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అందుకే ప్రమోషన్ చేయాలనీ వచ్చాను. నా ఆత్మా విశ్వాసమే నా బలం. మా అమ్మానాన్న నాకు ఎంతో ధైర్యాన్ని  ఇచ్చారు. వారే నాకు కొండంత బలం. ప్రస్తుతానికి  నా చెయ్యి వణకలేదు.. మైక్ కూడా వణుకలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక విశాల్ కోలుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరింతగా కోలుకొని సెట్ లో కూడా అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×