Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా హైకోర్టు సూచనల మేరకు గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ఇచ్చిన వెసులుబాటును ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే భవిష్యత్ లో తెల్లవారు ఝామున ప్రదర్శించే స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాతల అభ్యర్థన మేరకు ఆ చిత్ర బడ్జెట్, ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ప్రభుత్వం అన్నిరకాలుగా పరిశీలించి ఈ నెల 10న తెల్లవారు ఝామున 4 గంటల షోకు ప్రత్యేక అనుమతులతోపాటు 11 వ తేదీ నుంచి 19 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు, స్పెషల్ షోల అనుమతులపై దృష్టి సారించి, తమ నిర్ణయాన్ని ఉప సంహరించుకుంటున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Raj Tarun – Lavanya: తెరపైకి మరోసారి రాజ్ తరుణ్ ప్రేయసి.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అంటూ..!
తెలంగాణలో ఇకపై టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసలు ఇంతలా ప్రభుత్వం మాటను వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి.. ? ఎందుకు టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు ఉండవని చెప్పిందంటే.. అల్లు అర్జున్ చేసిన పని వలన. పుష్ప 2 బెన్ ఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెల్సిందే.
పోలీసుల అనుమతి లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడమే ఆ తొక్కిసలాటకు కారణమయ్యింది. ఇక ఆ ఘటనలో రేవతి కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇక ఈ ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఇకనుంచి తెలంగాణలో టికెట్ ధరలు, స్పెషల్ షోల అనుమతులు ఉండవని ఉత్తర్వులు జారీచేసింది.
ఇక గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభ్యర్దించగా కొన్ని వెసులుబాట్లు చేశారు. ఈ విషయంపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. బెన్ ఫిట్ షోలు రద్దుచేశామని చెప్పి.. మళ్లీ ఎలా వెసులుబాట్లు కల్పిస్తారని ప్రశ్నించింది. స్పెషల్ షో కూడా బెన్ ఫిట్ షో లాంటిదే అని, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని తెలుపుతూ.. ఇక నుంచి తెలంగాణలో ఎలాంటి షోస్ కు అనుమతులు ఇవ్వడం కుదరదని ఖరాకండీగా తేల్చి చెప్పింది.
Daaku Maharaj: డాకు మహారాజ్ స్టోరీ లీక్.. రొటీన్ సినిమాకు కాపీ.. ?
ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గేమ్ ఛేంజర్ సినిమాకు పెద్ద షాక్ అని చెప్పాలి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. చాలామందికి ఈ సినిమా ఎక్కలేదు. దీంతో టికెట్స్ సరిగా అమ్ముడు పోలేదు. అందులో మొదటి నుంచి కూడా టికెట్ బుకింగ్ చివర్లో ఓపెన్ అవ్వడంతో ఎక్కువమంది టికెట్స్ బుక్ చేయలేకపోయారు.
ఇక ఈ ఫేక్ కలక్షన్స్ అంటూ సోషల్ మీడియా గేమ్ ఛేంజర్ చిత్ర నరుండంపై దుమ్మెత్తిపోస్తుంది. ఇప్పటివరకు టికెట్ హైక్ ఉండడంతో కొద్దోగొప్పో కలక్షన్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ హైక్ లేదంటే.. ఇక గేమ్ ఛేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అసలే హైక్ ఉన్నా కలక్షన్స్ రావడం లేదు అని అనుకుటున్న మేకర్స్ నెత్తిపై ఈ తెలంగాణ ప్రభుత్వం మరింత భారాన్ని వేసింది. మరి ప్రభుత్వ నిర్ణయంపై దిల్ రాజు ఏమంటాడో చూడాలి.