BANK OF MAHARASHTRA Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఎ, ఎంబీఏ, పీఈజీడీఎంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BANK OF MAHARASHTRA) ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టులకు భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి అసక్తి గల అభ్యర్థులు మార్చి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని ఓసారి చూద్దాం.
ALSO READ: Court Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సొంత రాష్ట్రంలో జాబ్.. జీతం అక్షరాల రూ.77,840
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా ఉద్యోగాలు..
జనరల్ మేనేజర్(ఐబీయూ): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్(ఐబీయూ): 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ట్రెజరీ): 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫారెక్స్ డీలర్): 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(కాంప్లింయన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్): 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్రెడిట్): 01
చీఫ్ మేనేజర్(ఫారెక్స్/క్రెడిట్/ట్రేడ్ ఫైనాన్స్): 04
చీఫ్ మేనేజర్(కాంప్లియన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్): 02
చీఫ్ మేనేజర్(లీగల్): 01
సీనియర్ మేనేజర్(బిజినెస్ డెవలప్‌మెంట్): 02
సీనియర్ మేనేజర్(బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్): 05
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 4
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 15
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఎ, ఎంబీఏ, ప ఈజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. జనరల్ మేనేజర్‌కు 55 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 25 – 38 ఏళ్లు ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. జనరల్ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.1,56,500 – రూ.1,73,860, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ. 1,40,500 – రూ.1,56,500, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.1,20,940 – రూ.1,35,020, చీఫ్ మేనేజర్‌కు రూ.1,02,300 – రూ.1,20,940, సీనియర్ మేనేజర్‌కు రూ.85,920 – రూ.1,05,280 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.118 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు
అఫీషియల్ వెబ్ సైట్: https://bankofmaharashtra.in/
ALSO READ: ITBPF Recruitment: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 15