ITBPF Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హత, క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించిన అభ్యర్థులకు సువర్ణవకాశమనే చెప్పవచ్చు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సులో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు (ITBPF) స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), గ్రూప్-సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) ఉద్యోగాలకు అధికారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ALSO READ: Court Jobs: మీరు డిగ్రీ పాసయ్యారా..? కోర్టులో 241 ఉద్యోగాలు.. 4 రోజులే గడువు భయ్యా..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133
పురుషులకు 70 ఉద్యోగాలు, మహిళలకు 63 ఉద్యోగాలు ఉన్నాయి.
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు లో కానిస్టేబుల్, గ్రూప్-సీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అథ్లెటిక్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టైక్వాండో, ఆర్చరి, జిమ్నాస్టిక్స్, కబడ్డి, ఐస్‌హాకీ, హాకీ, ఫుడ్‌బాల్, గుర్రపు స్వారీ, కాయాకింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, ఐస్ స్కీయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖోఖో, సైక్లింగ్, యోగాసన, పెన్కాక్ సిలాట్, బాస్కెట్ బాల్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 4
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 2
విద్యార్హత: టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హత, క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: మార్చి 3 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పారా-4(డి) క్రీడల్లో పథకాలు పొంది ఉండాలి. అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: http://https//itbpolice.nic.in/
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: ECIL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.60,000, రేపే లాస్ట్ డేట్ భయ్యా..
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 2