BigTV English

NEET UG 2024: నీట్ ఆన్సర్ కీ విడుదల.. చెక్ చేసుకొండిలా..!

NEET UG 2024: నీట్ ఆన్సర్ కీ విడుదల.. చెక్ చేసుకొండిలా..!

NEET UG 2024 Answer Key:ఇటీవలే నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష NEET UG 2024 కు సంబంధించి తాత్కాలిక సమాధానాల కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కటాఫ్ అంచనా మార్కులను ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు నీట్ ఆన్సర్ కీ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల లోగా ఒక్కో ప్రశ్నకు రూ. 200 చెల్లించి తమ అభ్యంతరాలను నమోదు చేయాలని పేర్కొన్నది. neet.ntaonline.in ని సందర్శించడం ద్వారా ఆన్ లైన్ మోడ్ ద్వారా మాత్రమే అభ్యర్థులు తమ అభ్యంతరాలను లేవనెత్తాలని పేర్కొన్నది. ఆ అభ్యంతరాలను నిపుణుల బృందం విశ్లేషించి తుది సమాధాన కీని విడుదల చేయనున్నది.


కాగా, ఎన్టీఏ ఇటీవలే చేసిన ప్రకటనలో.. అభ్యర్థులు సమర్పించే సవాళ్లను సంబంధిత సబ్జెక్టు నిపుణుల ప్యానెల్ ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నది. అభ్యర్థులు లేవనెత్తే ప్రశ్నలు ఖచ్చితమైనదిగా పరిగణించబడితే ఆన్సర్ కీ అప్ డేట్ చేయబడుతుందని.. అది అందరికీ వర్తించబడుతుందని తెలిపింది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు!


అయితే, ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ యూజీ -2024 పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పెన్ పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించారు. నీట్ ద్వారా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో MBBS, BAMS, BDS, BHMS, BUMS సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కల్పించనున్నది. అదేవిధంగా మిలటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ యూజీ పరీక్ష మార్కుల ద్వారా ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×