E-Paper
Advertisement

NHAI: నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. రూ. 1,77,500 వరకు వేతనం, APPLY NOW

NHAI: నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. రూ. 1,77,500 వరకు వేతనం, APPLY NOW
Advertisement

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాజెక్టుల కోసం సమర్థులైన ఇంజనీర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) విభాగంలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మౌలిక సదుపాయాల రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

అర్హతలు, వయోపరిమితి.. 

Advertisement

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు మించకూడదు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానమిదే.. 

Advertisement

ఈ పోస్టులకు అభ్యర్థులను GATE-2025 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితా రూపొందించిన అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు వేతనం (పే లెవల్-10) లభిస్తుంది. దీనితో పాటు ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి.

దరఖాస్తు ప్రక్రియ విధానం.. 

ఆసక్తి గల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 9న ప్రారంభమైంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత పత్రాలు,  గేట్ స్కోర్ కార్డును పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 9, 2026.

చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2026.

నేషనల్ హైవేస్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే నిపుణులు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. సరైన ప్రణాళికతో దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలో సుస్థిరమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://nhai.gov.in

ALSO READ: IOCL Recruitment: ఐఓసీఎల్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×