ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ (NHPC) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 182 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
దేశంలోని ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌హెచ్‌పీసీ తన కార్యకలాపాల్లో భాగంగా నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ విద్యార్హతలను బట్టి సంబంధిత విభాగాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 182
విద్యార్హత: ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్‌లకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
స్టైఫండ్: ఎంపికైన వారికి శిక్షణా కాలంలో ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.15,000 అందుతుంది. డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.13,500 చెల్లిస్తారు. ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.12,000 స్టైపెండ్ లభిస్తుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా NATS లేదా NAPS పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్‌హెచ్‌పీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ధృవపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలనుకునే యువతకు ఇది చక్కని అవకాశం.
అఫీసియల్ వెబ్ సైట్: https://www.nfc.gov.in/
ALSO READ: రూ.93,960 జీతంతో.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే