E-Paper
Advertisement

రూ.93,960 జీతంతో.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే

రూ.93,960 జీతంతో.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర అంశాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం.

మొత్తం 27 సెక్యూరిటీ మేనేజర్ ఖాళీలు ఈ ప్రకటన ద్వారా భర్తీ కానున్నాయి.

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 23 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

Advertisement

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుండి రూ.93,960 వరకు పే స్కేల్ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది. తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. చివరిగా ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 తో పాటు ఇతర ఛార్జీలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 తో పాటు ఇతర ఛార్జీలు వర్తిస్తాయి.

ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి మే 5 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అర్హత గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా తమ దరఖాస్తులను పూర్తి చేయాలి. తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://punjabandsindbank.co.in/

ALSO READ: ఇండియన్ రైల్వేలో 3058 ఉద్యోగాలు.. అప్లై చేశారా? ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×