Railway Jobs: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానే వచ్చేసింది. ఎల్లుండి నుంచి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హులై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. ప్లాన్ ప్రకారం చదవండి. ఉద్యోగాన్ని సాధించండి.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 32438
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 23
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 22
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది.)
పేమెంట్ విధానం: ఆన్ లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, చలాన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.)
విద్యార్హత: టెన్త్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎల్లుండి నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/
Also Read: ONGC Jobs: ONGCలో ఉద్యోగాలు.. జీతం రూ.1,80,000.. ఇంకా రెండు రోజులే గడువు
అర్హులైన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.