AEE Jobs: బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఏఈఈ, జియోఫిజిసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108
ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏఈఈ, జియోఫిజిసిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఏఈఈ ఉద్యోగాలు: 98
జియోఫిజిసిస్ట్: 10
విద్యార్హత: బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ పాసైన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.)
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 24
ఎగ్జామ్ తేది: 2025 ఫిబ్రవరి 23
స్టైఫండ్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు ఉంటుంది.
వయస్సు: ఏఈఈ ఉద్యోగానికి 26 నుంచి 41 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
జియోఫిజిసిస్ట్ ఉద్యోగానికి 27 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://ongcindia.com/
Also Read: APPSC Group-1 Exams: గ్రూప్-1 పరీక్ష తేదీలు వచ్చేశాయ్.. ఇంకా 100 రోజుల సమయం..
బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.