Indian Railways: భారతీయ రైల్వే సంస్థ జమ్మూ-శ్రీనగర్ నడుమ వందేభారత్ స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ట్రయల్ రన్ పూర్తయ్యింది. ఒకేసారి పలు మార్గాల్లో వీటిని ప్రారంభించాలని భావిస్తున్నది. త్వరలోనే ఈ రైళ్లు నడవాల్సిన రూట్లపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోబోతోంది. ఈ రూట్లలో కచ్చితంగా జమ్మూ-శ్రీనగర్ మార్గం ఉండబోతోంది. ఈ రూట్ లో నడిచే, ఆల్ట్రా మోడ్రన్ రైలు ప్రస్తుతం ఢిల్లీలోని షకుర్ బస్తీ డిపోలో ఉంచారు.
జమ్మూ శ్రీనగర్ వందే భారత్ మార్గం
ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ లో రెండు రైళ్లు నడుస్తున్నాయి. జమ్మూ- శ్రీనగర్ ను కలిపే కొత్త సెమీ-హై-స్పీడ్ రైలు మూడో రైలు కాబోతోంది. శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా- శ్రీనగర్ నడుమ ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త రైలుకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను నార్త్ రైల్వే పరిధిలోని జమ్మూ డివిజన్ చూసుకుంటుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ మధ్య నడిచే వందేభారత్ స్లీపర్ రైలును త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే, ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. కత్రా-శ్రీనగర్ నడుమ ఫిబ్రవరిలో తన సర్వీసులను మొదలుపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జమ్మూ శ్రీనగర్ వందే భారత్ స్లీపర్ లో ప్రత్యేక ఫీచర్లు
జమ్మూ- శ్రీనగర్ మధ్య నడిచే వందేభారత్ స్లీప్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రత్యేకంగా యాంటీ-ఫ్రీజింగ్ ఫీచర్లతో రూపొందించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు చేసిన ఈ వందే భారత్ రైలు అత్యంత చల్లని పరిస్థితులలో.. అంటే 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ప్రయాణీకులు, లోకో పైలెట్లకు ఇబ్బంది కలగకుండా రైలు లోపల వెచ్చగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్ క్యాబిన్ లో హీట్ విండ్ షీల్డ్ ఉంటుంది. ఇది ముందు పొగ మంచు ఉన్నప్పటికీ స్పష్టమైన విజుబులిటీని అందిస్తుంది. రైలులో నీరు గట్టకట్టకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ఇందులో బయో-టాయిలెట్లు ఉన్నాయి. ఈ రైలు లోని అన్ని వ్యవస్థలు చల్లని వాతావరణంలోనూ పని చేసేలా రూపొందించారు.
జమ్ము-శ్రీనగర్ రైలుకు బుల్లెట్ ప్రూఫ్ విండోలు ఉన్నాయా?
జమ్మూ నుంచి శ్రీనగర్ కు నడిచే వందేభారత్ స్లీపర్ రైల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ రైలుకు సంబంధించి విండోలు బుల్లెట్ ప్రూప్ గా రూపొందించినట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై రైల్వే అధికారులు స్పందించారు. కాశ్మీర్ లోయ కోసం రూపొందించిన వందే భారత్ రైలులో సిసిటివి కెమెరాలు, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ లాంటి ప్రొటెక్షన్ ఫీచర్లు ఉన్నట్లు తెలిపారు. అయితే బుల్లెట ప్రూఫ్ విండోలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ పగలని కిటికీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా రాళ్లు రువ్వినా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది కలగదన్నారు.
Read Also: సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. పైన ప్యాసింజర్లు, మరి కింద?