E-Paper
Advertisement

RBI Recruitment: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఆర్బీఐలో 650 ఉద్యోగాలు, క్వాలిఫికేషన్ ఇదే

RBI Recruitment: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఆర్బీఐలో 650 ఉద్యోగాలు, క్వాలిఫికేషన్ ఇదే

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిరుద్యోగులకు భారీ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ప్రధాన నగరాల్లోని కార్యాలయాల్లో నియామకాలు చేపట్టనున్నారు.

నోట్: దరఖాస్తుకు 2 రోజులే గడువు

రాష్ట్రాల వారీగా వెకెన్సీలు..

అత్యధికంగా ముంబయి కార్యాలయంలో 249 ఖాళీలు ఉండగా చెన్నైలో 53 అలాగే కాన్పూర్, లఖ్‌నవూలో 50 పోస్టులు ఉన్నాయి. న్యూదిల్లీలో 49 స్థానాలు గువాహటిలో 36 భోపాల్‌లో 30 ఖాళీలు భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ కార్యాలయంలో 11 పోస్టులు కేటాయించారు. కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, భువనేశ్వర్, నాగ్‌పూర్, పట్నా, జైపూర్, తిరువనంతపురం, జమ్మూ కార్యాలయాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 650

నోట్: హైదరాబాద్‌లో 11 వెకెన్సీలు..

విద్యార్హత..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు కేవలం ఉత్తీర్ణత మార్కులు ఉంటే సరిపోతుంది. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (వర్డ్ ప్రాసెసింగ్) తప్పనిసరి. అభ్యర్థులు ఏ రాష్ట్ర కార్యాలయానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ ప్రాంత అధికారిక భాషపై పట్టు కలిగి ఉండాలి. స్థానిక భాషను రాయడం చదవడం మాట్లాడటం నిష్ణాతులై ఉండటం ఎంపికలో కీలకం కానుంది.

వయస్సు వివరాలు..

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2026 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది. తొలుత ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్ అంశాల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్షలో రీజనింగ్ ఇంగ్లిష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్‌నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలు ఉంటాయి. ఆఖరి దశలో భాషా నైపుణ్య పరీక్ష (LPT) నిర్వహిస్తారు. మెయిన్స్ మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది కానీ భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

జీతం వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 58,514 ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.

ఎగ్జామ్ సెంటర్స్…

తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థుల సౌకర్యార్థం ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజు..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 450 ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు కేవలం రూ. 50 ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి.

ముఖ్యమైన తేదీల వివరాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభం కాగా మార్చి 8వ తేదీతో ముగుస్తుంది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 11న మెయిన్ పరీక్ష జూన్ 7న నిర్వహించే అవకాశం ఉంది.

నోట్: దరఖాస్తుకు చివరి తేది: మార్చి 8

అఫీషియల్ వెబ్ సైట్: https://opportunities.rbi.org.in/

అప్లికేషన్ లింక్: https://ibpsreg.ibps.in/

ALSO READ: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×